తూర్పు లద్దాఖ్‌లోని మిగతా ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణకు చైనా సాకులు చెబుతోంది. ఇరుదేశాల సైనిక కమాండర్ల మధ్య పలు విడతల చర్చల తర్వాత పాంగాంగ్ సరస్సు వద్ద నుంచి బలగాలు ఉపసంహరించుకున్న డ్రాగన్... గోగ్రా, హాట్ స్ప్రింగ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతల నివారణ అంశాన్ని స్థానిక సైనిక కమాండర్లు పరిష్కరించుకోవాలని అంటోంది. ఇందుకోసం వర్కింగ్ మెకానిజమ్ ఫర్ కన్సల్టేషన్ అండ్ కో-ఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ) సమావేశం తేదీల కోసం భారత్ ఎదురుచూస్తోంటే డ్రాగన్ మాత్రం ఆ అవసరం లేదంటోంది.
మే 2020లో పాంగాంగ్, హాట్ స్ప్రింగ్ ప్రాంతాల్లో పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) దురాక్రమణతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే తూర్పులద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణ, ఉద్రిక్తతలు తగ్గాలని భారత్ స్పష్టం చేసింది. చైనా మాత్రం ఈ అంశాన్ని ద్వైపాక్షిక కోణంలో కాకుండా స్థానిక సమస్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోంది.
ఇదీ చూడండి: చైనాకు చలి భయం- లద్దాఖ్ నుంచి రివర్స్ గేర్!
ఇదీ చూడండి: 'కశ్మీర్'పై పాక్ మళ్లీ అదే మాట