ETV Bharat / international

చైనా 'ఇరాన్‌' తంత్రం.. ఎందుకీ దోస్తీ? - అమెరికా

అమెరికా, ఇరాన్​ల మధ్య ఉన్న వివాదాన్ని సొమ్ము చేసుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. అందుకే ఇరాన్​తో భారీ ఒప్పందం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం చైనా... ఇరాన్​లో 400 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెడుతుంది. రక్షణ, బ్యాంకింగ్, టెలికాం తదితర రంగాలకు సాయం చేయడం సహా, మిలటరీ, భద్రత అంశాల్లో సహకారం అందిస్తుంది.

china iran 400 billion dollars deal
చైనా..ఇరాన్‌ తంత్రం!!
author img

By

Published : Jul 18, 2020, 10:00 AM IST

లోకమంతా కరోనా మహమ్మారి విలయంలో కొట్టుమిట్టాడుతుంటే... హడావుడి లేకుండా అంతర్జాతీయంగా కీలక పరిణామం ఒకటి చోటుచేసుకుంది. అందులోనూ పాత్రధారి చైనానే! అదే ఇరాన్‌-చైనా ఒప్పందం.

ఎందుకీ దోస్తీ...?

ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు మద్దతిస్తోందని, అణుకార్యకలాపాలు చేపడుతోందని ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో ఇరాన్‌ ఆర్థికంగా ఇక్కట్లను ఎదుర్కొంటోంది. ఏ దేశం కూడా అమెరికా భయానికి సాయం చేయటానికి ముందుకు రావటం లేదు. ఈ పరిస్థితుల్లో ఇరాన్‌ ముందున్న ఏకైక మార్గం చైనానే. అందుకే చైనాతో ఒప్పందానికి సై అంటోంది. అటు చైనా కూడా అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌కు సాయం చేయటానికి ముందుకొస్తోంది. దీంతో తన చమురు అవసరాలు(చైనా తాను వాడే చమురులో 75శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది) తీరటంతో పాటు... అంతర్జాతీయ రాజకీయాల్లో కీలకమైన మధ్యప్రాచ్యంలోనూ పాగా వేసేందుకు చైనాకు సందు దొరుకుతోంది. తన బెల్ట్‌ రోడ్డు ద్వారా యూరప్‌పై పట్టుకు ప్రయత్నిస్తున్న చైనాకు ఇది సానుకూలాంశంగా చెబుతున్నారు. చైనా తన మిలటరీ కేంద్రాలను విస్తరించటానికి కూడా దోహదపడుతుంది. పెర్షియన్‌గల్ఫ్‌ ముఖద్వారంగా చెప్పుకునే జాస్క్‌ వద్ద చైనా పలు నౌకాశ్రయాల నిర్మాణానికి ప్రతిపాదిస్తోంది. మధ్య ఆసియాలోనే కాకుండా... ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాలో ఈ ప్రాంతం, ఈ పోర్టు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైంది. ఇప్పటిదాకా దీనిపై అమెరికా పట్టుంది. ఇప్పుడు చైనా కూడా ఇరాన్‌తో ఒప్పందం రూపంలో రంగంలోకి దిగుతోంది.

ఏంటీ ఒప్పందం?

ఈ ఒప్పందం ప్రకారం వివిధ రంగాల్లో సుమారు 400 బిలియన్‌ డాలర్ల మేర ఇరాన్‌లో చైనా పెట్టుబడులు పెడుతుంది. రక్షణ, బ్యాంకింగ్, టెలికాం, పోర్టులు, రైల్వేలు, ఫ్రీ ట్రేడ్‌ జోన్స్‌ నిర్మాణం తదితర రంగాల్లో చైనా సాయం చేస్తుంది. అంతేగాకుండా కీలకమైన మిలటరీ, భద్రత అంశాల్లో పరస్పర సహకారం ఉంటుంది. బదులుగా సుమారు 25 సంవత్సరాల పాటు చైనాకు ఇరాన్‌ తక్కువ ధరలకు చమురును సరఫరా చేస్తుంది.

అయితే ఇరాన్‌లో మాత్రం ఈ ఒప్పందంపై పూర్తి మద్దతు కన్పించటం లేదు. చైనాకు - దేశాన్ని తాకట్టు పెట్టడమే అంటూ చాలామందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆసియా, ఆఫ్రికాలోని కొన్ని దేశాలతో చైనా ఇలాంటి ఒప్పందాలు చేసుకొని వారిని లొంగదీసుకుంటున్న వైనం చూసి ఇరానియన్లలో ఈ భయం నెలకొంది. కానీ... అమెరికా ఆంక్షలతో ఆర్థికంగా దిగజారుతున్న నేపథ్యంలో ఇరాన్‌ ప్రభుత్వానికి చైనానే కల్పతరువులా కనిపిస్తోంది.

భారత్‌కేంటి?

ఉప్పు నిప్పులుగా సాగుతున్న అమెరికా, ఇరాన్‌లతో తన సంబంధాలను తెలివిగా నడుపుతూ వస్తోంది భారత్‌. ఇరాన్‌లోని చాబహార్‌ పోర్టు నుంచి జహెదాన్‌ (ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దులోనిది) దాకా రైల్వే లైన్‌ నిర్మాణానికి భారత్‌ సాయం చేస్తోంది. ఈ మేరకు ఒప్పందం కూడా జరిగింది. కానీ అమెరికా ఆంక్షల నేపథంలో ఇది కుంటినడక నడుస్తోంది. తాజాగా చైనాతో ఒప్పందం తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ రైల్వేలైన్‌ నిర్మాణానికి భారత్‌ సహకారం ఏమీ అవసరం లేదనీ... తామే సొంతగా నిర్మించు కుంటామంటూ ఇరాన్‌ ప్రకటించింది. భారత్‌ నుంచి నిధులు రాకపోవటం ఇందుకు కారణంగా చెప్పినా... చైనాతో ఒప్పందం అసలైన కారణమనేది బహిరంగ రహస్యం. చైనా, పాకిస్థాన్‌లు కలసి గ్వాదార్‌ పోర్టు నిర్మిస్తున్న నేపథ్యంలో- ఇరాన్‌లోని చాబహార్‌ పోర్టు ప్రాజెక్టు భారత్‌-ఇరాన్‌-ఆప్ఘనిస్థాన్‌లతో పాటు మధ్య ఆసియాలో వాణిజ్యపరంగా భారత్‌కు అత్యంత కీలకమైంది. అమెరికాలో ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలను బట్టి చైనా-ఇరాన్‌ ఒప్పంద ఫలితాలు ఆధారపడి ఉండొచ్చు.

ఇదీ చూడండి: ఓలి, ప్రచండ మధ్య సయోధ్య కోసం కీలక భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.