ETV Bharat / international

శ్వాస పరీక్షలో కొవిడ్‌ గుట్టు.. 'బ్రీత్‌లైజర్‌'తో 5 నిమిషాల్లోనే ఫలితం

Breathalyzer test: శ్వాస పరీక్షలోనే కొవిడ్​ గుట్టు కనిపెట్టే బ్రీత్​లైజర్​ను ఆవిష్కరించారు సింగపూర్​ శాస్త్రవేత్తలు. దీని ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే, మరింత కచ్చితంగా, ఎలాంటి లక్షణాలు లేనివారికి కూడా.. కరోనా సోకిందా? లేదా? అన్నది నిర్ధరించవచ్చాని చెబుతున్నారు.

breathalyser test
శ్వాస పరీక్షలో కొవిడ్‌ గుట్టు
author img

By

Published : Feb 4, 2022, 7:48 AM IST

Breathalyzer test: కొవిడ్‌ నిర్ధరణ పరిశోధనల్లో మరో ముందడుగు పడింది. కేవలం ఐదు నిమిషాల్లోనే, మరింత కచ్చితంగా, ఎలాంటి లక్షణాలు లేనివారికి కూడా.. కరోనా సోకిందా? లేదా? అన్నది నిర్ధరించే పరీక్ష వచ్చేసింది. దీని పేరు 'బ్రీత్‌లైజర్‌'. సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్‌ టెక్నికల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు.

ప్రస్తుతం 'ఆర్టీ-పీసీఆర్‌' విధానాన్నే కొవిడ్‌ నిర్ధరణకు అత్యంత విశ్వసనీయ పరీక్షగా భావిస్తున్నారు. అయితే, దీని ద్వారా ఫలితం తెలుసుకోవడానికి చాలా సమయం పడుతోంది. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ ద్వారా తొందరగానే రిజల్ట్‌ వస్తున్నా, తప్పుడు ఫలితాలు ఎక్కువగా ఉంటున్నాయి. వీటన్నింటికీ పరిష్కారంగా సింగపూర్‌ శాస్త్రవేత్తలు.. చేత్తో పట్టుకోవడానికి వీలైన బ్రీత్‌లైజర్‌ను రూపొందించారు. ఇందులో సెన్సర్లతో కూడిన ఒక చిప్‌ ఉంటుంది. పది సెకన్ల పాటు శ్వాసను పరీక్షించి, అందులోని రసాయన సమ్మేళనాలను సెన్సర్లు గుర్తిస్తాయి. తర్వాత ఈ బ్రీత్‌లైజర్‌ను రామన్‌ స్పెక్టోమీటర్‌లో ఉంచుతారు. కీటోన్లతో పాటు ఆల్కహాల్‌, ఆల్డెహైడ్‌లకు సెన్సర్లు ప్రతిస్పందించే తీరును బట్టి... సదరు వ్యక్తికి కొవిడ్‌ సోకిందీ, లేనిదీ ఈ పరికరం వెల్లడిస్తుంది.

ఇదీ చూడండి: నకిలీ కొవిషీల్డ్​ టీకాలతో కోట్ల రూపాయల దందా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.