ETV Bharat / international

ఇసుక తిన్నెల్లో చిక్కుకొని వందలాది తిమింగలాలు మృతి

author img

By

Published : Sep 24, 2020, 5:16 PM IST

ఆస్ట్రేలియా టాస్మానియా తీరం ఇసుక తిన్నెల్లో చిక్కుకొని.. 380 తిమింగలాలు మృత్యువాతపడ్డాయి. 88 వేల్స్​ను రక్షించగా.. మరికొన్నింటిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి సహాయ బృందాలు.

Whale swims free of Australian river as 270 are stranded
ఇసుక తిన్నెల్లో చిక్కుకొని వందలాది తిమింగలాలు మృతి

దక్షిణ ఆస్ట్రేలియాలోని టాస్మానియా తీరంలో ఇసుక తిన్నెల్లో చిక్కుకున్న పైలట్‌ తిమింగలాలను రక్షించే చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టాస్మానియాకు పశ్చిమాన ఉన్న స్ట్రాహన్‌ తీరంలో దాదాపు 500 తిమింగలాలు ఇసుక తిన్నెల్లో చిక్కుకున్నాయి. వీటిలో 380 వేల్స్​ ఇప్పటికే చనిపోగా.. 88 తిమింగలాలను సహాయ బృందాలు రక్షించగలిగాయి. మిగిలిన వాటిని కూడా రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Slug 88 whales rescued from Australia's worst mass beaching
మృత్యువాతపడ్డ తిమింగలం

మరోవైపు చనిపోయిన తిమింగలాల మృతదేహాలను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కుళ్లిపోయిన మృతదేహాలను సముద్రంలో పడేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. టాస్మానియాలో తిమింగలాలు తరచూ మృత్యువాతపడడం జరుగుతూనే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1996లో 320 పైలట్‌ వేల్స్​ ఇదే విధంగా తీరానికి కొట్టుకువచ్చాయని వారు గుర్తుచేశారు.

టాస్మానియాలో తిమింగలాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.