సిరియా అఫ్రిన్ సిటీలోని ఓ ఆసుపత్రిపై జరిగిన ఉగ్రదాడిలో 13 మంది మృతిచెందారు. 27మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. కుర్దిస్థానీ వర్కర్స్ పార్టీ, కుర్దిష్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఈ దాడి జరిపినట్లు తెలుస్తోంది.
దశాబ్దకాలంలో సిరియాలో 400కు పైగా ఆసుపత్రులపై ఉగ్రదాడులు జరగడం గమనార్హం. ఆ ప్రాంతంలో పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
ఇదీ చదవండి:రెండు మినీ వ్యాన్ల పేల్చివేత- ఏడుగురు మృతి!