ETV Bharat / international

సొంత వీర్యంతో రోగులకు గర్భం- వైద్యుడి నిర్వాకం!

దాతల నుంచి సేకరించిన వీర్యం కాకుండా సొంత వీర్యాన్ని (Fertility Doctor using own sperm) ఉపయోగించి వైద్యుడు తన తల్లిని గర్భవతిని చేశాడని ఓ మహిళ ఆరోపించారు. దీనిపై కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

author img

By

Published : Sep 15, 2021, 1:20 PM IST

FERTILITY DOCTOR
సొంత వీర్యంతో రోగులకు గర్భం

గర్భవతిని చేసేందుకు ఓ ఫర్టిలిటీ డాక్టర్ (Fertility Doctor) రహస్యంగా తన వీర్యాన్ని ఉపయోగించాడని న్యూయార్క్​కు చెందిన మహిళ కోర్టు తలుపు తట్టారు. పలువురు రోగులకు సైతం సొంత వీర్యాన్ని (Fertility Doctor using own sperm) ఉపయోగించి గర్భం వచ్చేలా చేశాడని పేర్కొన్నారు. ఈ మేరకు డాక్టర్ మోరిస్ వోర్ట్​మన్ అనే వైద్యుడిపై 35 ఏళ్ల మహిళ కేసు దాఖలు చేశారు.

ఇదీ జరిగింది...

పిటిషన్ దాఖలు చేసిన మహిళ తల్లి.. 1980లలో దాతల నుంచి సేకరించిన వీర్యంతో గర్భం దాల్చారు. రోచెస్టర్​కు చెందిన మోరిస్ వోర్ట్​మన్ అనే వైద్యుడు.. ఆమెకు ఈ చికిత్స అందించారు. స్థానిక వైద్య వీర్యాన్ని వీర్యాన్ని చికిత్సలో ఉపయోగించానని వైద్యుడు తెలిపాడు. అయితే, నిజానికి అది మోరిస్ సొంత వీర్యమేనని ఇప్పుడు ఆ మహిళ కూతురు ఆరోపిస్తున్నారు. దీనిపైనే వ్యాజ్యం దాఖలు చేశారు.

ఫిర్యాదు చేసిన మహిళ ప్రస్తుతం ఇదే వైద్యుడి వద్ద గైనకాలజీ చికిత్స తీసుకుంటున్నారు. 1985లో తాను జన్మించినట్లు మహిళ పేర్కొన్నారు. డీఎన్ఏ జీనాలజీ (తమ వంశంలోని వ్యక్తులను గుర్తించేందుకు) పరీక్ష చేయించుకుంటే తనకు తొమ్మిది మంది తోబుట్టువులు ఉన్నట్లు తేలిందని చెప్పారు.

ఈ వ్యవహారంపై వైద్యుడు వోర్ట్​మన్ స్పందించలేదు. ఆయన తరఫున మాట్లాడే న్యాయవాది వివరాలు సైతం వైద్యుడి కార్యాలయం వెల్లడించలేదు.

ఇలాంటివి ఎన్నో

నిజానికి, గత కొన్నేళ్లలో ఇలాంటి ఘటనలు 20కి పైగా వెలుగులోకి వచ్చాయి. దాతల వీర్యం కాకుండా, సొంత వీర్యాన్ని చికిత్సలో ఉపయోగిస్తున్నారని కొందరు వైద్యులపై ఆరోపణలు వస్తున్నాయి. నెవాడాలో జరిగిన ఇలాంటి ఉదంతంపై హెచ్​బీఓలో 'బేబీ గాడ్' అనే డాక్యుమెటరీ సైతం వచ్చింది. (documentary about fertility doctor)

ఇదీ చదవండి: ఖోఖో నేషనల్ ప్లేయర్​పై అత్యాచారం-​ ప్రతిఘటించిందని హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.