ETV Bharat / international

అమెరికాలో 61మిలియన్లు దాటిన కేసులు- ఫ్రాన్స్​లో ఆగని ఉద్ధృతి - ఫ్రాన్స్​లో కరోనా

Wold wide corona cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొత్తగా 18లక్షలకుపైగా వైరస్​ బారినపడ్డారు. అమెరికాలో కేసుల సంఖ్య 61 మిలియన్లు దాటింది. ఫ్రాన్స్​లో వైరస్​ ఉద్ధృతి తగ్గటం లేదు. కొత్తగా దాదాపు 3 లక్షల మందికి వైరస్​ సోకింది. బ్రిటన్​, ఇటలీ, అర్జెంటీనా వంటి దేశాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి.

Woldwide corona cases
కరోనా కేసులు
author img

By

Published : Jan 10, 2022, 9:46 AM IST

Wold wide corona cases: కరోనా మహమ్మారి ధాటికి యావత్​ ప్రపంచం విలవిల్లాడుతోంది. రోజుకు లక్షల మంది వైరస్​బారిన పడుతున్నారు. ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్యా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం ఒక్కరోజే 1,856,698 మందికి వైరస్ సోకింది. ఫలితంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 30,78,83,849 దాటింది. మరో 3,318 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 55,05,854కి చేరింది.

అమెరికా విలవిల..

అగ్రరాజ్యం అమెరికాలో ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 61 మిలియన్లు దాటింది. మరణాలు 8.6లక్షలకు చేరువయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 20శాతం, మరణాల్లో 15 శాతం అమెరికాలోనే ఉండటం గమనార్హం.

ఆదివారం ఒక్కరోజే.. 3,08,616 మందికి వైరస్​ సోకగా.. 308 మంది ప్రాణాలు కోల్పోయారు. 36వేల మంది వైరస్​ను జయించారు. 18.14 లక్షల యాక్టివ్​ కేసులు ఉన్నాయి. 22వేల మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

2020, నవంబర్​ 9 నాటికి అమెరికాలో కేసుల సంఖ్య 10 మిలియన్లు దాటింది. 2021, జనవరి 1కి 20 మిలియన్లు చేరింది. అది రెండు నెలల్లోనే మార్చి నాటికి 30 మిలియన్లు, సెప్టెంబర్​ 6 నాటికి 40 మిలియన్లు, డిసెంబర్​ 13 నాటికి 50 మిలియన్లకు చేరింది. 2021, డిసెంబర్​ 1న తొలి ఒమిక్రాన్​ కేసు నమోదైంది.

ఫ్రాన్స్​లో ఆగని ఉద్ధృతి..

కొత్త కేసుల విషయంలో అమెరికాతో పోటీ పడుతోంది ఫ్రాన్స్​. ఆదివారం ఒక్కరోజే 2,96, 097 మందికి వైరస్​ సోకింది. 90 మంది మరణించారు. 14,933 మంది కోలుకున్నారు. ఒమిక్రాన్​తో పాటు మరో కొత్త వేరియంట్​ కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. వైరస్​ కట్టడికి కఠిన చర్యలు అమలు చేస్తున్నారు అధికారులు.

అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాలు..

  • ఇటలీలో తాజాగా 1,55,659 మందికి కరోనా సోకింది. 157 చనిపోయారు.
  • బ్రిటన్​లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 1,41,472 కేసులు వెలుగుచూశాయి. 97మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఆస్ట్రేలియాలో కొత్తగా 1,00,571 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 23 మంది చనిపోయారు.
  • అర్జెంటీనాలో ఒక్కరోజే 73,319 కేసులు వెలుగుచాశాయి. 27 మంది చనిపోయారు.
  • టర్కీలో కొత్తగా 61,727 కేసులు నమోదయ్యాయి. 141 మంది వైరస్​ ధాటికి మృతి చెందారు.

ఇదీ చూడండి:

దేశంలో మరో 1.80 లక్షల కేసులు.. భారీగా తగ్గిన మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.