ETV Bharat / international

'టీకా​ కోసం 2021 ద్వితీయార్థం వరకు ఆగాల్సిందే'

author img

By

Published : Sep 5, 2020, 4:12 PM IST

కరోనా వ్యాక్సిన్​పై డబ్ల్యూహెచ్​ఓ ప్రధాన శాస్త్రవేత్త డా.సౌమ్య స్వామినాథన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్​కు అన్ని అనుమతులు వచ్చినా.. 2021 ద్వితీయార్థం వరకు భారీ స్థాయిలో పంపిణీ చేసే అవకాశం ఉండకపోవచ్చు అని పేర్కొన్నారు. ప్రస్తుతం మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​కు చేరుకున్న వ్యాక్సిన్ల పూర్తి స్థాయి ఫలితాలు ఈ ఏడాది చివర్లో రావొచ్చని అభిప్రాయపడ్డారు.

We-need-to-wait-till-next-year-for-vaccine-to-be-distributed-WHO-chief-scientist
'టీకా​ కోసం 2021 ద్వితీయార్థం వరకు ఆగాల్సిందే'

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ప్రజా వినియోగానికి అందుబాటులోకి వచ్చినప్పటికీ.. 2021 ద్వితీయార్ధం వరకు వాటిని భారీ స్థాయిలో పంపిణీ చేసే అవకాశం ఉండకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ప్రధాన శాస్త్రవేత్త డా.సౌమ్య స్వామినాథన్‌ అభిప్రాయపడ్డారు. 'వాస్తవం మాట్లాడుకోవాలంటే.. 2021 ద్వితీయార్ధం అంటే రెండో త్రైమాసికం చివరలో లేదా మూడో త్రైమాసికంలో భారీ స్థాయిలో డోసులు వివిధ దేశాలకు పంపిణీ అవుతాయి. ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చేరుకున్న వ్యాక్సిన్ల పూర్తి స్థాయి ఫలితాలు ఈ ఏడాది చివర్లో రావొచ్చు. దీని ఆధారంగా అంచనా వేస్తే వ్యాక్సిన్‌కు అనుమతులు లభించి భారీ స్థాయి ఉత్పత్తి జరగడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వ్యాక్సిన్‌ డోసులు అవసరం. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే 2021 ద్వితీయార్ధం వరకు వేచిచూడాల్సిందే' అని స్వామినాథన్‌ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల కరోనా వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్న విషయం తెలిసిందే. వీటిలో కొన్ని మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ వరకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరికి లేదా వచ్చే సంవత్సరం ఆరంభంలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫైజర్‌ వంటి కంపెనీ ఓ అడుగు ముందుకేసి ఈ అక్టోబర్‌ నాటికి వ్యాక్సిన్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ప్రకటించింది. మోడెర్నా, ఆస్ట్రాజెనెకా వంటి కంపెనీలు జరుపుతున్న ప్రయోగాలు సైతం తుది దశలో ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది చివరి నాటికి టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాల్ని కొట్టిపారేయలేమని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా సౌమ్య స్వామినాథన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇదీ చూడండి:- భారత్​లో 'స్పుత్నిక్​' టీకా తయారీకి రష్యా చర్చలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.