ETV Bharat / international

టీకా దుష్ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొన్న యువత - vaccine side effects heart

Vaccine side effects young adults: కరోనా టీకా వల్ల తలెత్తే గుండె కండర సమస్యను యువత చాలా మెరుగ్గా ఎదుర్కొంటున్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. టీకా తీసుకున్న తర్వాత దాదాపు అందరికీ ఈ సమస్య తలెత్తింది. అయితే, ఎవరికీ ప్రాణాపాయం కలగలేదని పరిశోధనలో తేలింది.

VACCINE SIDE EFFECT YOUTH
VACCINE SIDE EFFECT YOUTH
author img

By

Published : Dec 8, 2021, 7:54 AM IST

Vaccine side effects young adults: కొవిడ్‌ టీకా వల్ల వచ్చే మయోకార్డైటిటస్‌ అనే అత్యంత అరుదైన దుష్ప్రభావాన్ని యువత చాలా మెరుగ్గా ఎదుర్కోగలరని తాజా అధ్యయనం తేల్చింది. ఈ రుగ్మత వల్ల గుండె కండరంలో ఇన్‌ఫ్లమేషన్‌ తలెత్తుతుంది. 21 ఏళ్ల వయసులోపు వారిలో దీని ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. వీరిలో చాలా స్వల్ప లక్షణాలే కనిపిస్తాయని, అవి చాలా త్వరగా తగ్గిపోతాయని వెల్లడైంది.

Myocardial infarction vaccine youth

మయోకార్డైటిస్‌ సమస్యవల్ల గుండె బలహీనపడొచ్చు. మయోకార్డైటిస్‌ సమస్య.. చాలా సందర్భాల్లో ఇన్‌ఫెక్షన్‌ లేదా వైరస్‌తో తలెత్తిన ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల ఉత్పన్నం కావొచ్చు.

Vaccine side effects youth

టీకా తర్వాత ఎక్కువగా కౌమార, యువతలోనే ఇది కనిపించిందని పరిశోధకులు తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికా, కెనడాలో 139 మందిపై పరిశీలన జరిపారు. వీరి వయసు 12 నుంచి 20 ఏళ్ల మధ్య ఉంది. వీరిలో దాదాపు అందరికీ (97.8% మంది) ఎంఆర్‌ఎన్‌ఏ టీకా పొందాకే ఈ రుగ్మత వచ్చింది. 91.4% మందికి రెండో డోసు పొందాకే ఇది తలెత్తింది. ఎక్కువ మందిలో ఛాతి నొప్పి కనిపించింది. కొద్దిమందిలో జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. ప్రతి ఐదుగురు బాధితుల్లో ఒకరు ఆసుపత్రిలో చేరారు. అయితే, ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.