మిన్నెసొటా, విస్కాన్సిన్ ప్రాంతాల్లో మైనస్ 53 డిగ్రీల సెల్సీయస్లకు ఉష్ణోగ్రత పడిపోయింది. జన జీవనం అస్తవ్యస్తమయింది. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి.
గడ్డ కట్టుకుపోయిన నదులు
నదులు, సరస్సులు, కాలువలు, మంచి నీటి వనరులు గడ్డకట్టుకుపోయాయి. రోడ్లపై మంచు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. ప్రజలు ఇంట్లోనుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి.
ఉష్ణోగ్రతలో స్వల్పంగా మార్పు కారణంగా గడ్డకట్టిన మంచు కరిగి వరదలు సంభవించే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.