అమెరికా 244వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా... అక్కడి ప్రజలు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ట్రంప్.. మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
"నా ప్రియమైన స్నేహితుడికి ధన్యవాదాలు. అమెరికా భారతదేశాన్ని ప్రేమిస్తుంది!"
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
మోదీ శుభాకాంక్షలు
"అమెరికా 244వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా... అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు, యూఎస్ ప్రజలకు నా శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా.. స్వేచ్ఛ, మానవ విలువలను గౌరవిద్దాం."
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
దక్షిణ డకోటాలో జులై 4న నిర్వహించిన అమెరికా స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు ట్రంప్. అనంతరం మోదీ ట్వీట్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి: 'వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం'