కరోనా మహమ్మారి కారణంగా కకావికలమైన అగ్రరాజ్యం అమెరికాలో కొత్తగా రికార్డు స్థాయిలో 67 వేల 632 కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 36 లక్షల 16 వేల 747కి చేరింది. ఇప్పటివరకు లక్ష 40వేల 140 మందిని వైరస్ బలిగొంది. 16 లక్షల 45 వేల 962 మంది కోలుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కోటి 36 లక్షల 91 వేల 627కు చేరింది. వైరస్ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 5 లక్షల 86 వేల 821కు పెరిగింది. 80 లక్షల 37 వేల 170 మంది వైరస్ బారినపడి కోలుకున్నారు.
కేసులు అధికంగా ఉన్న దేశాలు
దేశం | కేసులు | మరణాలు | |
1 | అమెరికా | 36,16,747 | 1,40,140 |
2 | బ్రెజిల్ | 19,70,909 | 75,523 |
3 | భారత్ | 9,36,181 | 24309 |
4 | రష్యా | 7,46,369 | 11,770 |
5 | పెరు | 3,37,724 | 12,417 |
6 | చిలీ | 3,21,205 | 7,186 |
7 | మెక్సికో | 3,17,635 | 36,906 |
8 | దక్షిణాఫ్రికా | 3,11,049 | 4,453 |
9 | స్పెయిన్ | 3,04,574 | 28,413 |
10 | బ్రిటన్ | 291,911 | 45,053 |