మీరెప్పుడైనా దొంగ, పోలీసు ఛేజింగ్ చూశారా? దొంగ పారిపోతుంటే... పోలీసులు జీపుతోనో, బైక్‌తోనే తరుముకుంటూ వెళ్లి పట్టుకుంటారు. కానీ ఓ అమెరికన్ పోలీసు మాత్రం సైకిల్‌పై ఛేజ్ చేసి ఓ కరుడుగట్టిన నేరస్థుడిని పట్టుకున్నారు. ఆశ్చర్యంగా ఉందా? మీరే చూడండి.
అమెరికాలోని అట్లాంటాలో హత్యారోపణలు ఎదుర్కొంటున్న నికోలస్ ఫోన్సెకా అనే నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు వెంటబడ్డారు. కానీ వాడి వేగాన్ని అందుకోలేకపోయారు.
దీనితో ఓ పోలీసు దారిన పోతున్న ఓ సైక్లిస్ట్‌ను ఆపి, అతని సైకిల్ని బదులు తీసుకున్నారు. ఆ సైకిల్‌తోనే నిందితుడిని చేజ్ చేస్తూ.. అతను పారిపోతున్న మార్గాన్ని మిగతా పోలీసులకు తెలియజేశారు. దీనితో పోలీసులు చాకచక్యంగా పారిపోతున్న నిందితుడిని వలవేసి పట్టుకున్నారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. విపరీతమైన ఆదరణ లభిస్తోంది.
21 ఏళ్ల నికోలస్ ఫోన్సెకా హత్య కేసులో ప్రధాన నిందితుడు. ప్రస్తుతం అతనిని ఫుల్టన్ కౌంటీ జైలుకు తరలించారు.
ఇదీ చూడండి: ఈ విషయాల్లో మౌనమే ట్రంప్ కొంప ముంచుతోంది!