ETV Bharat / international

డెల్టా గుప్పెట్లో ప్రపంచదేశాలు- అమెరికాలో లక్షకుపైగా కేసులు

author img

By

Published : Aug 8, 2021, 10:57 AM IST

ప్రపంచంపై కరోనా మహమ్మారి మరోమారు పంజా విసురుతోంది. వ్యాక్సినేషన్​ వేగంగా చేపడుతున్న దేశాల్లోనూ కేసులు భారీగా పెరగటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో గత 4 రోజులుగా రోజువారీ కేసులు లక్షకుపైగా నమోదవుతున్నాయి. ఇటు చైనాలోని వుహాన్​లో కోటి మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు అధికారులు.

US averaging 100,000 new COVID-19 infections
డెల్టా గుప్పెట్లో ప్రపంచదేశాలు

కొవిడ్​ మహమ్మారి రూపం మార్చుకుంటూ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. డెల్టా, డెల్టా ప్లస్​ వ్యాప్తితో మళ్లీ కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. అమెరికాలో శనివారం ఒక్కరోజే కొత్తగా మరో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. 360 మంది చనిపోయారు. డెల్టా వేరియంట్​ వ్యాప్తి ఎక్కువగా ఉండడం వల్ల వైరస్​ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. శీతాకాలంలో వచ్చిన కేసులకు మించి ఎక్కువగా నమోదు అవుతుండడం అక్కడి వైద్యాధికారులను కలవరపెడుతోంది.

వుహాన్​లో కోటి మందికి కరోనా పరీక్షలు

చైనాలోని వుహాన్​ నగరంలో మరోసారి మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్​ పరీక్షలను విస్తృతం చేసింది అక్కడి యంత్రాంగం. నగరంలోని 1.1 కోట్ల మంది నుంచి నమూనాలను సేకరించినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. ఇప్పటివరకు కోటి నమూనాల ఫలితాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు.

కొవిడ్​ ఉద్ధృతి అధికంగా ఉన్న మరో 5 దేశాలు..

  • బ్రెజిల్​లోనూ వైరస్​ మళ్లీ పంజా విసురుతోంది. శనివారం కొత్తగా 43వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 12 వందల మందికిపైగా మరణించారు. 26 వేల మంది వైరస్​ను జయించారు. మొత్తం కేసుల సంఖ్య 2,01,51,779 కు చేరింది.
  • ఇండోనేసియాలో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది. శనివారం ఒక్కరోజే సుమారు 32 వేల మంది వైరస్​ బారినపడ్డారు. 1,588 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 వేల మంది కోలుకున్నారు. మొత్తం కేసులు 36,39,616 మరణాలు లక్షా ఐదు వేలకు పైకి చేరాయి.
  • ఇరాన్​లోనూ కొవిడ్​ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. కొత్తంగా 26వేల మందికి వైరస్​ అంటుకుంది. 387 మంది మరణించారు.
  • బ్రిటన్​లో శనివారం కొత్తగా 28వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. 103 మంది మరణించారు. 22వేల మంది కోలుకున్నారు.
  • ఫ్రాన్స్​లో, టర్కీలో 25వేలు, రష్యాలో 22వేలు, థాయిలాండ్​, మెక్సికోలో 21వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఆయా దేశాల్లో వైరస్​ ఉద్ధృతి పెరుగుతున్న క్రమంలో కొత్త ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు.

ఇదీ చూడండి: ఏడు నెలల పాటు స్థిరంగా యాంటీబాడీలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.