ETV Bharat / international

మెయిల్​ ఓటింగ్​ ట్వీట్​పై ట్రంప్​కు ట్విటర్ హెచ్చరిక - మెయిల్ ఓటింగ్ సిస్టమ్

మెయిల్​ ఓటింగ్​ విధానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్​పై ట్విటర్ హెచ్చరికలు చేసింది. ట్రంప్ చేసిన ట్వీట్​ పక్కతోవ పట్టించేదిగా ఉందని వివరణ ఇచ్చింది. ఈ సమాచారం సందేహాస్పదమైనదని తెలుపుతూ మెయిల్​ ఓటింగ్​పై వివరణ ఇచ్చే లింకును పెట్టింది.

Twitter warns Trump
ట్రంప్​
author img

By

Published : Sep 19, 2020, 5:17 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఓ ట్వీట్‌పై సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌ హెచ్చరికలు జారీ చేసింది. మెయిల్‌ ఓటింగ్‌ లేదా పోస్టల్‌ ఓటింగ్‌ విధానాన్ని గురించి ఆయన ఇచ్చిన సమాచారం పక్కతోవ పట్టించేదిగా ఉన్నందుకే తాము ఈ విధంగా చేసినట్టు సంస్థ వివరించింది.

Twitter warns Trump
ట్రంప్ ట్వీట్

"గతంలో ఎప్పుడూ లేని విధంగా అవసరానికి మించి భారీ సంఖ్యలో బాలెట్‌ పేపర్లను ఓటర్లకు లేదా ‘మరెక్కడికో’ పంపిస్తున్నారు. కొంతమంది కోరుకున్న విధంగానే నవంబర్‌ 3న జరగనున్న ఎన్నికల ఫలితాలు ఎప్పటికీ కచ్చితమైనవి కావు. నిన్నటికి నిన్న మరో ఎన్నికల వివాదం చోటుచేసుకుంది. ఈ బాలెట్‌ పిచ్చిని ఆపండి!’’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

కాగా ఈ సమాచారం సందేహాస్పదమైనదిగా ట్విటర్‌ యాజమాన్యం పేర్కొంది. మెయిల్‌ ఓటింగ్‌ సురక్షితమైనది, భద్రమైనదని తెలుపుతూ.. దానిని గురించిన సమాచారాన్ని తెలుసుకునే లింక్‌ను ఆ పోస్టుకు జతచేసింది.

ఇప్పటికే పలుమార్లు..

అనేక సంవత్సరాలుగా అమెరికా మిలిటరీ సిబ్బందితో సహా పలువురు ఏ సమస్యలు లేకుండా తమ అభ్యర్థిని ఎన్నుకునేందుకు మెయిల్‌ ఓటింగ్‌ విధానాన్ని అవలంబిస్తున్నారు. కాగా, ఈ విధానంలో భారీ స్థాయి ఎన్నికల మోసాలు, అక్రమాలు జరిగే అవకాశముందని అధ్యక్షుడు ట్రంప్‌ తరచుగా ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ట్రంప్‌ పోస్టులకు ట్విటర్‌ హెచ్చరిక చిహ్నాన్ని జోడించింది. మెయిల్‌ ఓటింగ్‌లో మోసాలను గురించి ట్రంప్‌ మేలో తొలిసారి చేసిన నిరాధారమైన వ్యాఖ్యలను గురించి కూడా ట్విటర్‌ ఈ విధంగానే హెచ్చరించింది. ఇదే కాకుండా ఆయన చేసిన పలు వివాదాస్పద పోస్టులపై కూడా ట్విటర్‌ నిజ నిర్ధరణ సూచనలను ట్యాగ్ చేసింది.

ఇదీ చూడండి: ఎన్నికల్లో​ సరికొత్త వ్యూహం.. 'మెయిల్ ఇన్​' బాక్స్​లు మాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.