ETV Bharat / international

ఆసుపత్రిలో ట్రంప్ మాజీ మేనేజర్​.. కారణమిదే - బ్రాడ్ పార్​స్కేల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ ప్రచార నిర్వాహకుడు బ్రాడ్ పార్​స్కేల్​.. తనకు తానుగా ఆయుధాలతో గాయపరుచుకుంటానని బెదిరించారు. ఆయన భార్య ఇచ్చిన సమాచారంతో పార్​స్కేల్​ను అదుపులోకి తీసుకున్న ఫ్లోరిడా పోలీసులు.. ఆసుపత్రిలో చేర్పించారు.

Trump
ట్రంప్ మాజీ మేనేజర్
author img

By

Published : Sep 28, 2020, 2:51 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ ప్రచార నిర్వాహకుడు బ్రాడ్ పార్​స్కేల్​ ఆసుపత్రిలో చేరారు. తనకు తానుగా హాని చేసుకుంటానని ఆయన బెదిరించినట్లు ఫ్లోరిడా పోలీసులు వెల్లడించారు. ఈ విషయానికి సంబంధించి బ్రాడ్ భార్య సమాచారం ఇచ్చారని తెలిపారు. పార్​స్కేల్​ తన వద్ద ఆయుధాలు ఉన్నాయంటూ బెదిరించారని వివరించారు.

ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీస్ అధికారి డీఅన్నా గ్రీన్​లా తెలిపారు. అమెరికా చట్టాల ప్రకారం ఎవరైనా తనకు తానుగా గాయపరుచుకునేందుకు ప్రయత్నిస్తే మానసిక ఆరోగ్యంపై పరీక్షించేందుకు 72 గంటల పాటు అదుపులోకి తీసుకుంటారు.

పార్​స్కేల్​, ఆయన కుటుంబానికి ఎలాంటి సాయమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ ప్రచార విభాగ అధికారి టిమ్​ ముర్తాఫ్ తెలిపారు. ట్రంప్ అల్లుడు జేర్​డ్ కుష్నర్​ నేతృత్వంలో 2016 ఎన్నికల ప్రచారంలో పార్​స్కేల్ కీలకంగా పనిచేశారు. పార్​స్కేల్​ను ఈ ఏడాది జులైలో ప్రచార విభాగం మేనేజర్​ పదవి నుంచి తొలగించారు. అనంతరం ఆయన డిజిటల్ కార్యకలాపాల్లో ప్రచార విభాగానికి సాయం అందిస్తున్నారు.

ఇదీ చూడండి: రెండేళ్లలో ట్రంప్ పన్ను చెల్లింపులు 750 డాలర్లు మాత్రమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.