ETV Bharat / international

'కమల'కు ట్రంప్​ కౌంటర్- 4 బృందాలతో ఓట్ల వేట - ముస్లిం వాయిసెస్ ఫర్ ట్రంప్

భారతీయ అమెరికన్లను మచ్చిక చేసుకునేందుకు ట్రంప్ కొత్త ప్రచార బృందాలను రంగంలోకి దింపారు. 'ఇండియన్ వాయిసెస్ ఫర్ ట్రంప్', 'హిందూ వాయిసెస్ ఫర్ ట్రంప్' సహా మొత్తం నాలుగు కొత్త ప్రచార విభాగాలను ఏర్పాటు చేశారు. అమెరికా ఎన్నికల్లో భారతీయ అమెరికన్ ఓట్లు కీలకం కానున్న నేపథ్యంలో వీరిపై దృష్టిసారించింది ట్రంప్ ఎన్నికల ప్రచార కమిటీ. డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతి కమలా హారిస్​ ఎంపికైన నేపథ్యంలో ఈ చర్య ప్రాధాన్యం సంతరించుకుంది.

Trump campaign creates coalitions to woo Indian-American, South Asian voters
ఇండియన్ కింగ్​మేకర్ల ట్రంప్ కొత్త 'ప్రచార అస్త్రాలు'
author img

By

Published : Aug 15, 2020, 10:57 AM IST

అమెరికా ఎన్నికల్లో ప్రవాసుల పాత్ర కీలకమన్న విషయం తెలియంది కాదు. ముఖ్యంగా భారతీయ అమెరికన్ల ఓట్లు చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం వీరిని ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండో-అమెరికన్లు, సిక్కులు, ముస్లింలు ఇతర ఆసియా దేశాల వర్గాల మద్దతు కోసం నాలుగు కొత్త ప్రచార బృందాలను రంగంలోకి దింపారు.

'ఇండియన్ వాయిసెస్ ఫర్ ట్రంప్', 'హిందూ వాయిసెస్ ఫర్ ట్రంప్', 'సిక్ ఫర్ ట్రంప్', 'ముస్లిం వాయిసెస్ ఫర్ ట్రంప్' పేరిట ఏర్పాటు చేసిన ఈ కూటములు.. అమెరికాలోని ఆయా వర్గాలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తాయని ట్రంప్ ప్రచార కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది.

ట్రంప్ మరోసారి గెలిస్తే..

భారతదేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గౌరవిస్తూ అధ్యక్షుడు ట్రంప్ నిబద్ధతతో తీసుకున్న చర్యల వల్ల భారత-అమెరికన్లు గణనీయంగా పురోగతి సాధించారని ప్రచార కమిటీ పేర్కొంది. ట్రంప్ మరోసారి అధికారంలోకి వస్తే భారత్-అమెరికా భాగస్వామ్యం మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుందని తెలిపింది.

"అమెరికా అభివృద్ధిలో పాలుపంచుకున్న లక్షలాది మంది హిందువుల గౌరవార్ధంగా 'హిందూ వాయిసెస్ ఫర్ ట్రంప్' నిలుస్తుంది. సిక్కుల నిస్వార్థ సేవను 'సిక్ అమెరికన్స్ ఫర్ ట్రంప్' గుర్తిస్తుంది. ముస్లిం సమాజాన్ని 'ముస్లిం వాయిసెస్ ఫర్ ట్రంప్' మరింత బలోపేతం చేస్తుంది. అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఎన్నికైతే అమెరికాలో హిందూ, ముస్లిం, సిక్కుల మత స్వేచ్ఛ హక్కుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి."

-ట్రంప్ ప్రచార విభాగం

సిక్కుల వెబ్​సైట్​లో హర్దీప్​ సింగ్​!

'సిక్కు వాయిసెస్​ ఫర్ ట్రంప్​' ప్రచారంలో భాగంగా భారత పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఫొటోను ట్రంప్ క్యాంపెయిన్ ఉపయోగించుకుంది. భారత పర్యటన సందర్భంగా అధ్యక్షుడికి మహాత్మా గాంధీ విగ్రహాన్ని పూరి బహుకరిస్తున్న ఫొటోను వెబ్​సైట్​లో పొందుపర్చింది.

Trump campaign creates coalitions to woo Indian-American, South Asian voters
వెబ్​సైట్​లో హర్దీప్​ సింగ్ పూరి చిత్రం

మేరీలిన్ కార్సన్, హర్మీత్ ధిల్లాన్, మృణాలినీ కుమారీ, అల్ మసన్​ను ఇండియన్ వాయిసెస్ ఫర్ ట్రంప్​ ప్రచార కూటమికి కో ఛైర్మన్లుగా నియమించారు. డొనాల్డ్ ట్రంప్​తో పాటు రిపబ్లికన్ పార్టీకి మద్దతు బలమైన మద్దతు ఇచ్చే సామాజిక వర్గాలను ఈ నాలుగు ప్రచార బృందాలు ప్రతిబింబిస్తాయని ట్రంప్ కూటమి డైరెక్టర్ ఆశ్లే హయాక్ వెల్లడించారు.

వీరే కింగ్ మేకర్లు

సుమారు 13 లక్షల మంది భారతీయ అమెరికన్లు నవంబర్​లో జరగనున్న ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. పెన్సిల్వేనియా(2 లక్షలు), మిషిగాన్ (1.25 లక్షలు) వంటి రాష్ట్రాల్లో ఇండో అమెరికన్ల ఓట్లు భారీగా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో గెలవడం అధ్యక్ష అభ్యర్థికి చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో భారతీయ అమెరికన్ ఓట్లను కైవసం చేసుకోవడానికి అభ్యర్థులిద్దరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భారత సంతతికి చెందిన రాజకీయ నేత కమలా హారిస్​ను ఉపాధ్యక్ష పదవికి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ఎంచుకున్నారు. ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్లే కింగ్​మేకర్లుగా అవతరించే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదీ చదవండి- ఆగని కరోనా ఉద్ధృతి.. 50 వేలకు చేరువలో మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.