ETV Bharat / international

మాస్క్ లేకపోతే 8 నిమిషాలు గాల్లోనే!

మనం మాస్క్ ధరించకుండా మాట్లాడేటప్పుడు వెలువడే తుంపర్లు గాల్లో 8 నిమిషాలుంటాయని ఓ అధ్యయనంలో తేలింది. ఆ తుంపర్లతోపాటు వైరస్​ కూడా గాల్లో సజీవంగా ఉంటుంది. దీంతో ​వైరస్​ వ్యాప్తి మరింత ఎక్కువవుతుంది.

study on corona virus results that covid stays alive 8 minutes in the air
మాస్క్ లేకపోతే.. 8 నిమిషాలు గాల్లోనే!
author img

By

Published : May 15, 2020, 9:35 AM IST

ముఖానికి మాస్కుల అవసరాన్ని నొక్కి చెప్పే మరో ప్రయోగ ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. మనం సాధారణంగా మాట్లాడినా వెలువడే తుంపర్లు గాల్లో దాదాపు ఎనిమిది నిమిషాల పాటు ఉంటాయని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని 'ది నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డయాబెటిస్‌ అండ్‌ డైజస్టివ్‌ అండ్‌ కిడ్నీ డిసీజ్‌' పేర్కొంది.

గాలి తక్కువగా ఉండే ఆసుపత్రులు, ఇళ్లు, క్రూజ్‌ షిప్‌లు వంటివి కరోనావైరస క్లస్టర్లుగా ఎందుకు మారుతున్నాయనే అంశంపై పరిశోధనలకు ఈ సమాచారం మరింత ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ పరిశోధనలో వెలుగు చూసిన అంశాలను 'ది ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌' అనే జర్నల్‌లో ప్రచురించారు.

గట్టిగా మాట్లాడుతున్నప్పుడు ప్రతి క్షణం నోటి నుంచి వేలకొద్దీ తుంపరలు వెలువడుతున్నట్లు లేజర్‌ సాయంతో గుర్తించారు. వీటిల్లో వైరస్‌తో నిండిన తుంపరలు 1,000 గాల్లో ఎనిమిది నిమిషాలపాటు ఉంటున్నట్లు గ్రహించారు. దీంతో ఈ వైరస్‌ చిన్న తుంపరల నుంచి కూడా వ్యాపిస్తుందని అనుమానిస్తున్నారు. అసలు మాట్లాడినప్పుడు నోటినుంచి ఎన్ని చిన్న తుంపరలు వెలువడతాయి.. ఎంతసేపు గాల్లో ఉంటాయనే అంశాన్ని కనుగొనేందుకు ఈ పరిశోధన నిర్వహించారు.

ఇదీ చదవండి:ఆ కళాఖండాలు.. లాక్​డౌన్​ కష్టాలకు ప్రతిరూపాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.