ETV Bharat / international

కమల X పెన్స్ : సంవాదంలో గెలుపెవరిది?

అమెరికా అధ్యక్ష సమరంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో.. సాల్ట్​ లక్​ సిటీ వేదికగా ఉపాధ్యక్ష అభ్యర్థులు ముఖాముఖీ తలపడనున్నారు. వీరి చర్చ అధ్యక్ష అభ్యర్థులు ఆధిక్యం సాధించేందుకు ఉపయోగపడనుంది. అధ్యక్షుడు ట్రంప్​కు కరోనా సోకిన నేపథ్యంలో ఈ డిబేట్​ కోసం మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు అధికారులు.

Pence-Harris debate to unfold as Trump recovers from virus
'ఉపాధ్యక్ష' పోరు: సంవాదంలో గెలుపెవరిది?
author img

By

Published : Oct 7, 2020, 6:25 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. డెమొక్రటిక్‌ పార్టీ నుంచి ఉపాధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిస్‌‌, ప్రస్తుత ఉపాధ్యక్షుడు, రిపబ్లిన్‌ పార్టీ నుంచి ఉపాధ్యక్ష రేసులో ఉన్న మైక్‌ పెన్స్ బుధవారం‌ ముఖాముఖీ తలపడనున్నారు. యూటా రాష్ట్రంలోని సాల్ట్​ లేక్‌ సిటీలో ఈ కార్యక్రమం జరగనుంది. యూఎస్‌ఏ టుడే పత్రికకు చెందిన సుసన్‌ పేజ్‌ సంధానకర్తగా వ్యవహరించనున్నారు. అమెరికా చరిత్రలో ఓ ప్రత్యక్ష చర్చా కార్యక్రమంలో ఓ భారత సంతతి వ్యక్తి పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం. కరోనా సంక్షోభం ముదురుతుండటం, అధ్యక్షుడు ట్రంప్​ వైరస్​ నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం అందరి చూపు వీరిపైనే ఉంది.

హారిస్‌ ఆధిపత్యంపై అంచనాలు..

వీరి చర్చ అధ్యక్ష అభ్యర్థులు ఆధిక్యం సాధించేందుకు దోహదం చేయనుంది. మరోవైపు ట్రంప్‌ కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన సొంత విధానాలతో పాటు ట్రంప్‌ లక్ష్యాలను కూడా పెన్స్ వివరించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:- ట్రంప్​ X బైడెన్​: వాడీవేడిగా తొలి డిబేట్​

బైడెన్‌ బృందంలో హారిసే కీలక పాత్ర పోషించనున్నారన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరిరువురి చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది. చర్చలో పెన్స్‌పై హారిస్‌ ఆధిపత్యం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కరోనా జాగ్రత్తలు మరింత కట్టుదిట్టం..

అధ్యక్ష అభ్యర్థుల ప్రత్యక్ష చర్చలో పాల్గొన్న కొన్ని రోజులకే ట్రంప్‌ కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో తాజా కార్యక్రమంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల మధ్య గ్లాస్‌ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదీ చూడండి:- అమెరికా ఎన్నికల ప్రచారంలో అమీర్ ఖాన్​ పాట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.