ETV Bharat / international

రష్యాపై కరోనా పంజా- 7 లక్షలకు చేరువలో కేసులు - corona cases in russia

ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తూనే ఉంది. రష్యాలో కొత్తగా 6 వేల కేసులు బయటపడ్డాయి. మెక్సికోలో 5 వేలు, పాకిస్థాన్​లో 3 వేలు, ఇరాన్​లో 2 వేల మంది కొత్తగా వైరస్ బారిన పడ్డారు. చైనా, దక్షిణకొరియాలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి.

Pakistan coronavirus cases reach 234,508
రష్యాపై కరోనా పంజా... 7 లక్షలకు చేరువలో కేసులు
author img

By

Published : Jul 7, 2020, 7:18 PM IST

ప్రపంచ దేశాలపై కరోనా కోరలు చాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్​ బాధితుల సంఖ్య కోటీ 17 లక్షల 72 వేలకు చేరింది. మరణాల సంఖ్య 5 లక్షల 41 వేలు దాటింది.

రష్యాలో మరో 6 వేల కేసులు..

రష్యాపై కరోనా పంజా విసురుతూనే ఉంది. రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా మరో 6,368 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 7 లక్షలకు చేరువైంది.

పాకిస్థాన్​లో మరో 2,691 కేసులు

పాకిస్థాన్​లో కరోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 2,637 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మరో 77 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 2,34,509 మంది బాధితులు ఉన్నారు. వీరిలో 1,34,957 మంది వైరస్​ నుంచి కోలుకోగా... 4,839 మందిని కరోనా పొట్టనబెట్టుకుంది.

ఇరాన్​లో 200 మంది మృతి..

ఇరాన్​లో కరోనా కేసులు తగ్గినప్పటికి, మరణాలు మాత్రం పెరుగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కొత్తగా 200 మంది మృతి చెందారు. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.

  • బంగ్లాదేశ్​లో మరో 3 వేల కేసులు నమోదు కాగా... మొత్తం కేసుల సంఖ్య లక్షా 69 వేలు దాటింది. వీరిలో 2 వేల మంది వైరస్ కారణంగా మృత్యుఒడికి చేరారు.
  • మెక్సికోలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 2,61,750కి చేరింది.
  • చైనాలో ఇవాళ మరో 8 మందిలో వైరస్​ బయటపడింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 84 వేలకు చేరువైంది.
దేశాలు మొత్తం కేసులు మరణాలు
అమెరికా30,41,9501,33,041
బ్రెజిల్​16,28,28365,631
రష్యా6,94,23010,494
పెరు3,05,70310,772
స్పెయిన్​2,98,86928,388

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.