ETV Bharat / international

'కోలుకుంటారో.. నిరాశలో కూరుకుపోతారో తేల్చుకోండి' - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​

డెమోక్రటిక్​ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​ లక్ష్యంగా మరోమారు తీవ్ర విమర్శలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తనకు ఓటు వేసి.. కరోనా సంక్షోభం నుంచి వేగంగా కోలుకుంటారో, లేక బైడెన్​ను గెలిపించి నిరాశావాదంలో కూరుకుపోతారో తేల్చుకోవాలని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు అయ్యే సామర్థ్యం బైడెన్​కు లేదన్నారు.

Nov 3 poll choice between super recovery and Biden depression: Trump
'నాకు ఓటేస్తే రికవరీ.. బైడెన్​ను గెలిపిస్తే నిరాశే'
author img

By

Published : Oct 24, 2020, 9:26 AM IST

Updated : Oct 24, 2020, 11:49 AM IST

ఓటింగ్‌ సమయం సమీపిస్తున్న వేళ.. అమెరికాలో ఎన్నికల వేడి మరింత పెరిగింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ప్రత్యర్థి, డెమోక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌.. బైడెన్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. నవంబర్‌ 3న జరిగే అధ్యక్ష ఎన్నికలు అమెరికన్లకు ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. తన పరిపాలనలో వైరస్‌ నుంచి వేగంగా కోలుకోవటమా లేక.. బైడెన్‌ను గెలిపించి నిరాశావాదంలో కూరుకుపోవటమా అనేది అమెరికన్లు తేల్చుకోవాలని ట్రంప్‌ సూచించారు. ప్రత్యర్థి జో బైడెన్‌కు అమెరికా అధ్యక్షుడు అయ్యే సామర్థ్యం లేదన్న ట్రంప్.. ఇది తమ మధ్య జరిగిన చివరి సంవాదంలో తేలిపోయిందని పేర్కొన్నారు.

మరోవైపు ట్రంప్‌ విమర్శలకు బైడెన్‌ దీటుగా ప్రతిస్పందించారు. వైరస్‌పై పోరాడటాన్ని ట్రంప్‌ పూర్తిగా విస్మరించారన్న ఆయన.. ట్రంప్ పాలనలో వేల మంది అమెరికన్లు కరోనా బారినపడి మరణించారని గుర్తుచేశారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే కరోనా వ్యాక్సిన్‌ను అమెరికన్లకు ఉచితంగా అందిస్తానని హామీ ఇచ్చారు. మహమ్మారి కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న అమెరికన్లను ఆదుకుంటానని జో భరోసా ఇచ్చారు.

ఇదీ చూడండి:- ట్రంప్​- బైడెన్​ గ్రాఫ్​లో మార్పు... తేడా 4 పాయింట్లే!

చూసింది తక్కువే!

అధ్యక్ష అభ్యర్థుల మధ్య చివరి సంవాదంలో వివిధ అంశాలపై వాడీవేడి చర్చే జరిగింది. అయితే మొదటి డిబేట్​తో పోల్చితే.. ఈసారి 10మిలియన్​ వ్యూస్​ తక్కువగా నమోదయ్యాయి. తొలి డిబేట్​ను 73.1మిలియన్​ మంది వీక్షించగా.. శుక్రవారం జరిగిన సంవాదాన్ని 63మిలియన్​ మంది చూసినట్టు అంచనా వేసింది నీల్సన్​ సంస్థ. ట్రంప్​నకు కరోనా సోకడం వల్ల రెండో డిబేట్ రద్దయింది.

అయితే రెండో డిబేట్​కు బదులు 'టౌన్​హాల్​' టీవీ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో బైడెన్​ పైచేయి సాధించినట్టు కనిపిస్తోంది. బైడెన్​ కార్యక్రమాలను 14.1 మిలియన్​ మంది వీక్షించగా.. ట్రంప్​​ టీవీ షోలను 13.5 మిలియన్​మంది చూశారు.

ఇదీ చూడండి:- ట్రంప్​Xబైడెన్​​: చర్చంతా కరోనాపైనే..

Last Updated : Oct 24, 2020, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.