2020 రసాయన శాస్త్రం నోబెల్ బహుమతిని ఇద్దరు శాస్త్రవేత్తలకు ప్రకటించింది రాయల్ స్వీడిష్ అకాడమి. జినోమ్ ఎడిటింగ్ విధానాన్ని అభివృద్ధి చేసిన ఇమ్మాన్యుయెల్ చార్పెంటియర్, జెన్నిఫర్ ఏ డౌడ్నను ఈ ఏడాది అవార్డుకు ఎంపిక చేసింది.
జీనోమ్ ఎడిటింగ్...
జన్యు పరంగా వచ్చే వ్యాధులను నివారించేందుకు ఉపయోగపడే 'మాలిక్యులర్ సిజర్స్ 'వంటిదే ఈ జీనోమ్ ఎడిటింగ్ విధానం. ఇది చాలా శక్తిమంతమైనదని, కొత్త చికిత్సా విధానాలను ఆవిష్కరించేందుకు ఉపయోగపడుతుందని నోబెల్ కమిటీ పేర్కొంది. జన్యుపరంగా ఉన్న సమస్యలను ఈ ఎడిటింగ్తో పరిష్కరించవచ్చని తెలిపింది. అయితే ఇంతటి శక్తిమంతమైన సాంకేతికతను చాలా జాగ్రత్తగా వినియోగించాలని స్పష్టం చేసింది.
పురస్కార గ్రహీతలకు బంగారు పతకంతో పాటు 1.1 మిలియన్ డాలర్ల నగదు అందించనుంది నోబెల్ కమిటీ.
ఇప్పటికే వైద్య, భౌతిక శాస్త్రాల్లో నోబెల్ బహుమతులను ప్రకటించింది రాయల్ స్వీడిష్ అకాడమి. సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాలకు నోబెల్ పురస్కారాని ప్రకటించాల్సి ఉంది.
ఇవీ చూడండి:-