ETV Bharat / international

ఆ రెండు మరణాలను ముందే గుర్తించి ఉంటే...! - కరోనా వైరస్​ అమెరికా వార్తలు

అమెరికాలో కరోనా మరణాలపై కీలక విషయాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. ఫిబ్రవరి 29న దేశంలో తొలి మరణం సంభవించిందని భావిస్తుండగా.. అందుకు దాదాపు మూడు వారాల ముందే వైరస్​తో ఇద్దరు వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. వైరస్​ సోకి లక్షణాలు కనపడటానికి ఒకటి నుంచి రెండు వారాల సమయం పడుతుంది కాబట్టి.. జనవరి చివరి వారం నుంచే కాలిఫోర్నియాలో వైరస్​ విస్తరిస్తోందని అర్థమవుతోంది. ఈ విషయం ముందే తీవ్రంగా పరిగణించి ఉంటే అగ్రరాజ్యంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉండేవి కావని విశ్లేషకులు చెబుతున్నారు.

new-virus-timeline-california-had-2-deaths-weeks-earlier
ఆ రెండు మరణాలను ముందే గుర్తించి ఉంటే...!
author img

By

Published : Apr 24, 2020, 9:22 AM IST

886,709 కేసులు.. 50,243 మరణాలు.. ఇవీ అమెరికాలో కరోనా వైరస్​ ప్రస్తుత గణాంకాలు. ప్రపంచంలో మరే ఇతర దేశాల్లో లేనంతగా కేసులు, మరణాలు అగ్రరాజ్యంలోనే నమోదయ్యాయి. తొలి కరోనా మరణం(ఫిబ్రవరి 29) గుర్తించినప్పటి నుంచి వైరస్​ కట్టడికి చర్యలను కఠినం చేసింది అమెరికా. అయితే దీనికి.. దాదాపు మూడు వారాల ముందే వైరస్​తో అమెరికాలోనే అత్యంత జనాభా కలిగిన కాలిఫోర్నియాలో ఇద్దరు మృతిచెందారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీటిని ముందే గుర్తించి ఉంటే అగ్రరాజ్యంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉండేవి కావని విశ్లేషకులు అంటున్నారు.

అసలేం జరిగింది..?

ఫిబ్రవరి 6న కాలిఫోర్నియాలోని శాంటా క్లారా కౌంటీకి చెందిన 57ఏళ్ల వృద్ధురాలు, అదే నెల 17న 69ఏళ్ల వృద్ధుడు మరణించారు. జనవరి చివరి వారం నుంచి ఫ్లూ లక్షణాలతో బాధపడిన వృద్ధురాలు.. కోలుకుంటున్న సమయంలో ప్రాణాలు కోల్పోయిందని బంధువులు తెలిపారు.

అయితే వీరి కణజాలం నమూనాలను సెంటర్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ అండ్​ ప్రివెన్షన్​ ఫర్​ ఎనాల్సిస్​(సీడీసీ)కు పంపగా.. మంగళవారం రిపోర్టులు వచ్చాయి. అందులో మృతులకు వైరస్​ సోకినట్టు తేలింది.

ఎన్నో ప్రశ్నలు...

అయితే వీరిద్దరు ఆ మధ్యకాలంలో దేశాన్ని విడిచి వెళ్లలేదు. మరి వీరికి వైరస్​ ఎలా సోకిందనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. అప్పటివరకు ఎలాంటి లాక్​డౌన్​ లేకపోవడం, పర్యటనలపై నిషేధాలు లేకపోవడం వల్ల చైనా సహా వైరస్​ బాధిత దేశాల నుంచి వేలమంది ప్రజలు అమెరికాలో పర్యటించారని గుర్తుచేస్తున్నారు.

పైగా కాలిఫోర్నియాలో ఫ్లూ వంటి లక్షణాలతో ఆ సమయంలో ప్రజలు సతమతమయ్యారు. అందువల్ల కరోనా వైరస్​ను ప్రత్యేకించి గుర్తించడం జరిగి ఉండదని ఉత్తర కాలిఫోర్నియా ఆరోగ్య డైరక్టర్​ డా.సారా కోడీ తెలిపారు. అప్పటికి వైరస్​ పరీక్షలు నిర్వహించడానికి కాలిఫోర్నియాలో సరైన పరికరాలు లేవని పేర్కొన్నారు. ఎవరికి పరీక్షలు నిర్వహించాలి? అనే దానిపైనా ప్రభుత్వం పరిమితులు విధించిందన్నారు.

"పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించి, వైరస్​ వ్యాప్తిపై నివేదిక రూపొందించి ఉంటే.. ప్రజలు అప్పటికే ప్రాణాలు కోల్పోతున్నారన్న విషయం అర్థమయ్యేది. ముందే అప్రమత్తమయ్యేవాళ్లం."

--- డా. సారా కోడీ, ఉత్తర కాలిఫోర్నియా ఆరోగ్య డైరక్టర్​.

మామూలుగా వైరస్​ లక్షణాలు బయటపడటానికి ఒకటి, రెండు వారాల సమయం పడుతుంది. ఫిబ్రవరి 6న తొలి మరణం సంభవించిందంటే.. జనవరి చివరి వారంలోనే కాలిఫోర్నియాలో వైరస్​ విస్తరించిందని అర్థమవుతోంది. అంటే కాలిఫోర్నియాలో లాక్​డౌన్​ విధించినప్పటికే(మార్చి 20) పరిస్థితులు విషమంగా ఉన్నాయి.

తాజా పరిణామాల నేపథ్యంలో కాలిఫోర్నియా అధికారులు అప్రమత్తమయ్యారు. డిసెంబర్​ నుంచి ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలను సేకరించాలని రాష్ట్ర నలుమూలకు ఆదేశాలు జారీ చేసినట్టు గవర్నర్​ గావిన్​ న్యూసోమ్​ వెల్లడించారు. దీని వల్ల మరింత స్పష్టత వచ్చే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎందుకింత ఆలస్యం?

అయితే మృతుల కణజాలం నమూనాలను మార్చి మధ్యలోనే సీడీసీకి పంపారు. కానీ మంగళవారం వరకు నివేదికలు రాలేదు. దీనిపై స్పందించడానికి అధికారులు నిరాకరించారు.

ఇదీ చూడండి- కరోనాతో సహజీవనం: లాక్​డౌన్​ ఎత్తివేత దిశగా ప్రపంచం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.