ETV Bharat / international

Omicron cases in America: అమెరికాలో విస్తరిస్తున్న ఒమిక్రాన్‌ కేసులు! - అమెరికాలో ఒమిక్రాన్​ కేసులు

Omicron cases in America: ఒమిక్రాన్​ కేసులు అమెరికాలో మరింతగా విస్తరిస్తున్నాయి. శనివారం తొలికేసు నమోదు కాగా.. తాజాగా మరో రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ ఒక్క రాష్ట్రంలోనే ఇప్పటి వరకు ఎనిమిది కేసులు నమోదయ్యాయి. దీంతో ఒమిక్రాన్​ సామాజిక వ్యాప్తి ప్రారంభమైనట్లు నిపుణులు అనుమానిస్తున్నారు.

omicron cases
ఒమిక్రాన్‌ కేసులు
author img

By

Published : Dec 5, 2021, 1:44 PM IST

Omicron cases in America: అమెరికాలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. శనివారం న్యూయార్క్‌లో మరో రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ ఒక్క రాష్ట్రంలోనే ఇప్పటి వరకు ఎనిమిది కేసులు నమోదయ్యాయి. సామాజిక వ్యాప్తి ప్రారంభమైన సంకేతాలు కనిపిస్తున్నాయని ఆ రాష్ట్ర హెల్త్‌ కమిషనర్‌ మేరీ బాసెట్‌ తెలిపారు.

ఒమిక్రాన్‌ కేసులు పాకిన రాష్ట్రాల జాబితాలో తాజాగా మసాచ్యుసెట్స్‌, వాషింగ్టన్‌ కూడా చేరాయి. శనివారం అక్కడ తొలి కేసులు నమోదయ్యాయి. శుక్రవారం న్యూజెర్సీ, జార్జియా, పెన్సిల్వేనియా, మేరీలాండ్‌, మిసౌరీలో కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. వీటితో పాటు నెబ్రాస్కా, కాలిఫోర్నియా, హవాయి, కొలరెడో, ఉటాలోనూ ఒమిక్రాన్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

న్యూయార్క్‌ రాష్ట్రంలో నమోదైన ఎనిమిది కేసుల్లో ఏడు గ్లోబల్‌ సెంటర్‌గా ఉన్న న్యూయార్క్‌ నగరంలోనే వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. గత నెల వ్యవధిలో ఈ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు రెండింతలకు పెరగడం గమనార్హం. మరోవైపు డెల్టా వేరియంట్‌ వ్యాప్తితో ఇప్పటికే అక్కడి ఆసుపత్రులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. ఈ తరుణంలో కొత్త వేరియంట్‌ కూడా వ్యాపిస్తుండడం అక్కడి యంత్రాంగాన్ని కలవరపరుస్తోంది. అత్యవసరం కాని చికిత్సలను వాయిదా వేయాలని అధికారులు ఆసుపత్రులను ఆదేశిస్తున్నారు.

US Travel Rules: ఒమిక్రాన్​ సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో.. ప్రపంచ దేశాలు మళ్లీ ఆంక్షలు కట్టుదిట్టం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ కొవిడ్​ కట్టడికి కాస్త కఠిన నిర్ణయాలే తీసుకున్నారు. ప్రయాణ ఆంక్షల వల్ల విదేశాల నుంచి అమెరికన్లకు కూడా ఇబ్బందులు ఎదురుకానున్నాయి.

ఇతర దేశాల్లో ఇలా..

ఒమిక్రాన్​ వ్యాప్తిని తీవ్రంగా పరిగణించిన జర్మనీ.. వ్యాక్సిన్​ తీసుకోనివారికి లాక్​డౌన్​ విధించింది.

ఐరోపాలో అత్యంత తక్కువ వ్యాక్సినేషన్​ జరిగిన దేశం ఆస్ట్రియా. ఇక్కడ అర్హులైన 20 లక్షల మందికిపైగా ఇంకా వ్యాక్సిన్​ తీసుకోలేదు. ఇటీవల కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. అక్కడి ప్రభుత్వం కూడా వీరికి లాక్​డౌన్​ విధించింది.

ఇటలీలో ఆరోగ్య సిబ్బంది తప్పనిసరిగా టీకా తీసుకోవాల్సిందే. లేకుంటే ఉద్యోగం ఉండదు. డిసెంబర్​ 6 నుంచి ఇటాలియన్లకు కొవిడ్​ గ్రీన్​ పాస్​ తప్పనిసరి. కరోనా నుంచి కోలుకున్న లేదా వ్యాక్సిన్​ వేసుకున్నవారికి మాత్రమే ఇది లభిస్తుంది.

ఇదీ చూడండి: Dementia Heart Rate: గుండె వేగంతో మతిమరుపు ముప్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.