అమెరికా పర్యటనలో భాగంగా(modi us visit).. దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24న భేటీ కానున్నారు. తాజాగా.. వీరి సమావేశంపై శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది(modi us trip). అగ్రనేతల భేటీతో ఇరు దేశాల మైత్రి మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేసింది(modi us visit 2021). అదే సమయంలో క్వాడ్ బృందాన్ని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడింది.
"ప్రజల ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువలపై ఏడు దేశాబ్దాలుగా ఇరు దేశాల మైత్రి ముడిపడి ఉంది. వీటిని బలోపేతం చేసే దిశగా అగ్రనేతలు చర్చలు జరపనున్నారు. స్వేచ్ఛాయుత ఇండో-పెసిఫిక్, కరొనా మహమ్మారిపై పోరాటంలో పాల్గొని భారత్‌తో భాగస్వామ్యాన్ని మరింత పెంచుకుంది బైడెన్ ప్రభుత్వం. ఇదే కొనసాగాలని ఆశిస్తోంది."
-- శ్వేతసౌధం.
ఉగ్రవాద నిరోధక చర్యలపైనా ఇరు నేతలు చర్చించనున్నట్టు అగ్రరాజ్య అధికారి మీడియాకు వెల్లడించారు. వివిధ ప్రాంతీయ సమస్యలు, అభివృద్ధి అంశాలు భేటీలో ప్రస్తావనకు వస్తాయన్నారు.
24న.. అగ్రనేతల మధ్య సమావేశం జరగనుంది. అనంతరం బైడెన్ అధ్యక్షతన క్వాడ్ భేటీకానుంది. ఇందులో మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిదే సుగా పాల్గొననున్నారు(quad countries summit). క్వాడ్ దేశాధినేతలు ముఖాముఖిగా సదస్సులో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ ఏడాది మార్చిలో క్వాడ్ నేతల మధ్య తొలి సదస్సు జరిగినప్పటికీ కరోనా కారణంగా ఈ నలుగురు నేతలు వర్చువల్‌గా సమావేశమయ్యారు.
మోదీ-బైడెన్ ఇప్పటివరకు అనేక మార్లు ఫోన్ సంభాషణలు జరిగాయి. కానీ బైడెన్ అధ్యక్షత బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ కలవడం ఇదే తొలిసారి కానుంది. ఈ నేపథ్యంలో చర్చలు కేవలం ప్రభుత్వ అంశాలకే పరిమితం కాకుండా.. ఇరు దేశాలను మరింత చేరువచేసే విధంగా ఉంటాయని ఆశిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
హ్యారిస్‌తో భేటీ...
అమెరికా ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి భారత సంతతి మహిళగా చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్‌తోనూ(kamala harris news) మోదీ భేటీకానున్నారు. బైడెన్‌ను కలిసే ఒక రోజు ముందు.. సెప్టెంబర్ 23న.. మోదీ-హ్యారిస్ సమావేశం ఉండనుంది. ఇరువురి మధ్య ఇదే తొలి భేటీకానుంది.
"ఈ నెల 23న.. భారత ప్రధాని నరేంద్ర మోదీ- వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ మధ్య భేటీ జరగనుంది."
-- శ్వేతసౌధం ప్రకటన.
మోదీ షెడ్యూల్ ఇలా...
ఈ నెల 22న వాషింగ్టన్కు చేరుకోనున్నారు మోదీ(modi america news). ఆ తర్వాతి రోజు.. అమెరికాలోని సీఈఓలతో సమావేశం కానున్నారు. వీరిలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మోదీ షెడ్యూల్ బయటకు వస్తే దీనిపై మరింత స్పష్టత వస్తుంది.
మోదీ వాషింగ్టన్లో ఉండే సమయానికే.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా అక్కడ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వారిరువురి మధ్య సమావేశం జరిగే అవకాశమున్నట్టు వార్తలు వస్తున్నాయి.
24సాయంత్రం వాషింగ్టన్ నుంచి న్యూయర్క్ వెళతారు ప్రధాని. ఐరాస జనరల్ అసెంబ్లీలో కీలక ప్రశంగం చేయనున్నారు(modi un speech 2021).
రెండో ప్రయాణం..
కొవిడ్ అనంతర కాలంలో మోదీ.. విదేశీ పర్యటన చేపట్టడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చిలో బంగ్లాదేశ్‌కు వెళ్లారు మోదీ. అమెరికాలో చివరిసారిగా.. 2019లో పర్యటించారు మోదీ(modi tour to usa). మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన 'హౌడీ మోదీ' కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి:- 'ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా'