ETV Bharat / international

ప్రమాదానికి గురైన యాత్రికుల బస్సు.. 19మంది మృతి - Mexico bus accident

యాత్రికులతో వెళుతున్న ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. మెక్సికోలో జరిగిన ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా.. 32 మంది గాయపడ్డారు.

bus accident
బస్సు ప్రమాదం
author img

By

Published : Nov 27, 2021, 3:04 AM IST

సెంట్రల్ మెక్సికోలో యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 19 మంది మరణించారు. మరో 32 మంది గాయపడ్డారు. మెక్సికో సిటీలోని జోక్విసింగో టౌన్‌షిప్‌లో ఈ ప్రమాదం జరిగింది. బస్సు అధిక వేగంతో వెళ్తుండగా బ్రేకులు విఫలమయ్యాయని.. దీనితో ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు.

డిసెంబర్ 12న జరుపుకునే 'వర్జిన్ ఆఫ్ గ్వడెలోప్' సమీపిస్తున్న నేపథ్యంలో పుణ్యక్షేత్రాలను దర్శిస్తుంటారు మెక్సికన్లు. ఈ క్రమంలోనే మిచోకాన్ అనే ప్రాంతం నుంచి రోమన్ క్యాథలిక్ యాత్రికులు సందర్శించే చల్మా పట్టణానికి ఈ బస్సు బయలుదేరింది.

అయితే.. ఇరుకైన రోడ్లు, కాలం చెల్లిన బస్సుల్లో ప్రయాణించడం వల్లే అత్యంత తరచుగా ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.