ETV Bharat / international

సరదాగా పాత ఏటీఎం కొన్నాడు.. తెరిచి చూస్తే... - ఏటీఎం

జంక్​యార్డ్​ నుంచి ఓ వ్యక్తి పాత ఏటీఎం కొనుగోలు చేశాడు. దానికి అతడికైన ఖర్చు రూ.22,360. ఆ ఏటీఎం​ను తెరిచి చూడగా.. అందులో రూ. 1.5లక్షలు బయటపడ్డాయి.

Man buys old ATM machine from junkyard, finds over Rs 1.5 lakh in it
పాత ఏటీఎం మెషిన్​ కొన్నాడు.. తెరిచిచూస్తే..!
author img

By

Published : Oct 12, 2021, 3:37 PM IST

జీవితం ఎప్పుడు ఏ విధంగా మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కోటీశ్వరులు ఒక్క రోజులో అన్నీ కోల్పోతే, అసలేమీ లేని వాళ్లు ధనికులైన సంఘటనలు ఎన్నో! తాజాగా.. ఓ వ్యక్తి జీవితంలోనూ ఇదే జరిగింది. అతడు ఒక్కరోజులో లక్షాధికారి అయిపోయాడు. అందుకు కారణం ఓ 'ఏటీఎం​'.

మీడియా కథనాల ప్రకారం.. ఓ వ్యక్తి 300డాలర్లు(రూ. 22,360) ఖర్చు పెట్టి జంక్​యార్డు నుంచి ఓ ఏటీఎంను కొనుగోలు చేశాడు. అది అమ్మిన వ్యక్తి దానికి సంబంధించిన కీ ఇవ్వలేదు. దీంతో ఏటీఎం​ను కొనుగోలు చేసిన వ్యక్తి.. తన సహచరుడి సహాయంతో దాన్ని బద్దలుకొట్టాడు.

అందులో నోట్ల కట్టలు అందులో దర్శనమిచ్చాయి. మొత్తంగా 2వేల డాలర్లు(రూ. 1.5లక్షలు) బయటపడ్డాయి. అవి చూసి ఆ వ్యక్తి ఆనందంలో మునిగిపోయాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇంటర్నెట్​లో షేర్​ చాశాడు. సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియో వైరల్​గా మారింది. వీక్షకులు వీడియోను విపరీతంగా లైక్​ చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు.

అయితే.. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న వివరాలు తెలియలేదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి:- లాటరీ టికెట్ కొని మర్చిపోయిన మెకానిక్.. కొద్దిరోజులకు కోటీశ్వరుడై...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.