ETV Bharat / international

సడలింపు దిశగా ప్రపంచం.. అమెరికాలో రాజకీయ వేడి!

కరోనా వైరస్ ప్రభావం తగ్గినట్లు భావిస్తున్న పలు దేశాలు లాక్​డౌన్ ఆంక్షల్ని సడలిస్తున్నాయి. పలు వ్యాపార రంగాలు తెరుచుకుంటున్నాయి. ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. ఆంక్షల ఎత్తివేత అంశంపై అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఇళ్లకే పరిమితమైతే తాము ఉపాధి కోల్పోతున్నామని నిరసనకారులు రోడ్డెక్కారు.

lockdown relaxations across the globe
lockdown relaxations across the globe
author img

By

Published : Apr 21, 2020, 6:33 AM IST

Updated : Apr 21, 2020, 9:51 AM IST

ప్రపంచంలోని వివిధ దేశాలు సోమవారం లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించాయి. దీంతో జనసందోహం మొదలైంది. డెన్మార్క్‌లోని టాటూ పార్లర్లు, ఆస్ట్రేలియాలోని బీచ్‌లు, జర్మనీలోని పుస్తక దుకాణాలు తెరచుకుంటున్నాయి. ఆస్ట్రేలియాలో అతిపెద్ద ధారావాహిక ‘నైబర్స్‌’ చిత్రీకరణను పునఃప్రారంభించనున్నారు. జర్మనీ, స్వీడన్‌, స్లొవేకియాల్లో కార్ల ఉత్పత్తి మళ్లీ ప్రారంభం కానుంది. డెన్మార్క్‌లోనూ క్రమేపీ వ్యాపార కార్యకలాపాలు మొదలవుతున్నాయి. ఇరాన్‌లో జాతీయ రహదారుల్ని, వ్యాపార కేంద్రాలను తెరవడం ప్రారంభమయింది.

భిన్నాభిప్రాయాలు...

ఇటలీలో మరణాలు ఎక్కువగా కనిపించిన దృష్ట్యా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలా, కొనసాగించాలా అనే విషయమై భిన్నాభిప్రాయాలున్నాయి. ఆంక్షల్ని సడలించే అవకాశాలు లేవని బ్రిటన్‌ చెబుతోంది. అనేక ఇతర దేశాలూ సడలింపుల దిశగానే వెళ్తున్నా, కొత్త కేసులు పెరగకుండా సామాజిక దూరాన్ని తగినంత పాటించాలని భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 177 దేశాల్లో ఇప్పటి వరకు దాదాపు 24.53 లక్షల మంది కరోనా బారిన పడగా వారిలో 1.65 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క అమెరికాలోనే 41 వేల మందికి పైగా చనిపోయారు. ఇప్పటివరకు ఈ దేశంలో 7,71,000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

అగ్రరాజ్యంలో రాజకీయం..

ఇళ్లకే పరిమితం కావాలన్న ఆంక్షల్ని వ్యతిరేకిస్తున్నవారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బాహాటంగానే మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఉపాధిని కోల్పోతున్నామంటూ ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ప్రదర్శనల కారణంగా కొన్ని రాష్ట్రాలు, ప్రధానంగా రిపబ్లికన్‌ నేతల పాలనలో ఉన్నవి ఆంక్షల్ని సడలించే దిశగా వెళ్తున్నాయి. అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచికి తక్షణం ఉద్వాసన పలకాలని నిరసనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. నిరసనలో భాగంగా వారెవరూ మాస్కులు ధరించడం లేదు, వ్యక్తిగత దూరం పాటించడం లేదు.

ఆంక్షల ఎత్తివేతలో తొందరపడితే మొదటికే మోసం వస్తుందని ఫౌచి హెచ్చరిస్తున్నారు. క్రమేపీ సాధారణ పరిస్థితులకు చేరుకోవడానికి అమెరికాలోని పలు ప్రాంతాలు సిద్ధంగా ఉన్నాయని ట్రంప్‌ చెబుతున్నారు. పరీక్షల సంఖ్యను పెంచాలని ఆయన రాష్ట్రాలను కోరారు. దానికి తాము సిద్ధమేనని, సరిపడా సంఖ్యలో కిట్లు లేనందున వాటిని ముందు సరఫరా చేయాలని రాష్ట్రాలు అడుగుతున్నాయి. వెంటనే ఆంక్షలను సడలించడం తొందరపాటే అవుతుందని, మరోసారి కరోనా విజృంభించే అవకాశం ఉందని రాష్ట్రాల గవర్నర్లు హెచ్చరిస్తున్నారు.

70 మృతదేహాలు...

మరోవైపు న్యూజెర్సీలోని ఒక నర్సింగ్‌హోంలో కవర్లలో చుట్టి ఉంచిన 70 మృతదేహాలు ఒకేసారి బయటపడడం కలకలం రేకెత్తించింది. న్యూజెర్సీతో పాటు కనెక్టికట్‌లో కొత్తగా మరణాల సంఖ్య తగ్గడం ఉపశమనాన్ని కలిగించే విషయం. న్యూయార్క్‌లో 3000 మందికి యాంటీబాడీ పరీక్షలు నిర్వహించే కార్యక్రమం సోమవారం మొదలయింది. ఆ రాష్ట్రంలో ఆంక్షల ఎత్తివేతకు ఇంకా సమయం ఉందని గవర్నర్‌ చెప్పారు. న్యూయార్క్‌లో సోమవారం మృతుల సంఖ్య 478కి తగ్గింది. మూడువారాల్లో ఇదే తక్కువ.

అలా అనుకోవటం తగదు

ఏ దేశంలోనైనా లాక్‌డౌన్‌ ఆంక్షల్ని సడలించడమంటే అక్కడ అంతటితో కరోనా అంతరించినట్లు కాదనీ, తదుపరి దశకు ప్రారంభంగా మాత్రమే దానిని చూడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్‌ అధనోమ్‌ పేర్కొన్నారు. జి-20 దేశాల ఆరోగ్య మంత్రులతో ఆయన ఆన్‌లైన్‌ సమావేశాన్ని నిర్వహించారు. తొందరపాటుతో ఏ నిర్ణయాలు తీసుకోవద్దని ఆయా దేశాలకు గట్టిగా హెచ్చరించారు. వెన్వెంటనే సాధారణ పరిస్థితికి రావాలనుకోవడం తగదనీ, చర్యలన్నీ దశలవారీగానే తీసుకోవాలని స్పష్టం చేశారు. కరోనా కారణంగా ఐరోపా సమాఖ్య మొత్తంమీద దాదాపు ఆరు కోట్ల మంది నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటారని మెకిన్సే అంచనా వేసింది. కరోనాను అదుపు చేయలేకపోతే ఈయూలో నిరుద్యోగిత 6% నుంచి దాదాపు రెట్టింపు అవుతుందని పేర్కొంది.

ఐరోపాలో కరోనాబారిన పడినవారి సంఖ్య 10 లక్షలు, మృతుల సంఖ్య ఒక లక్ష దాటింది. వైరస్‌ తీవ్రత తగ్గుతుండడం వల్ల లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు ప్రణాళికల్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ప్రకటించాయి.

ఇదీ చూడండి: ప్రపంచంపై కరోనా పంజా.. 25 లక్షలకు చేరువలో కేసులు

Last Updated : Apr 21, 2020, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.