అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత జో బైడెన్ సొంతరాష్ట్రం డెలావేర్‌లోని వెల్మింగ్టన్‌లో తొలిసభలో ఏర్పాటు చేశారు డెమొక్రాట్లు. ఈ సభలో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ ప్రసంగించారు.
ఎన్నికల్లో తన గెలుపును మహిళాలోకం సాధించిన విజయంగా అభివర్ణించారు కమలా హారిస్. అమెరికా మహిళలు తమ ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసమే ఈ తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. 'ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళను కావొచ్చు. కానీ చివరి మహిళను కాను' అని కమల అన్నారు.
అధ్యక్ష పదవికి ఎన్నికైన బైడెన్ నిరంతరం అమెరికన్ల క్షేమం కోసమే ఆలోచిస్తారని పేర్కొన్న కమల... ఆయన అమెరికాను సురక్షితంగా ఉంచగలరని విశ్వాసం తనకుందన్నారు.
ఇదీ చూడండి: శ్వేతసౌధ అధికార బదిలీకి రంగం సిద్ధం!