అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు, అశాంతి సంబంధిత వైరల్ కంటెంట్‌ను నియంత్రించేదుకు ఫేస్బుక్ అత్యవసర చర్యలను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై విశ్వసనీయ వర్గాల సమచారాన్ని ప్రస్తావిస్తూ.. ప్రముఖ వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది.
ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి.. ఎన్నికల సమయంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు ఫేస్బుక్ ప్రయత్నిస్తోందని ఈ కథనంలో పేర్కొంది.
'సురక్షితమైన ఎన్నికల కోసం మేము ఏళ్లుగా కృషి చేస్తున్నాం. గత ఎన్నికల నుంచి నేర్చుకున్న పాఠాలను ఇప్పుడు అమలు చేస్తున్నాం. నిపుణులను నియమించుకున్నాం. కొత్త బృందాలను ఏర్పాటు చేశాం.' అని ఓ ఫేస్బుక్ అధికారి తెలిపినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ రాసుకొచ్చింది.
' ఫేస్బుక్ తీసుకొస్తున్న ఈ చర్యలు వైరల్ కంటెంట్ తీవ్రత ఎక్కువ ఉన్న దేశాల కోసం రూపొందించినవి. మయన్మార్, శ్రీలంకల్లో వీటిని ఇప్పటికే వినియోగించడం గమనార్హం. వైరల్ కంటెంట్‌ను నిరోధించేందుకు, విశ్వసనీయ సమాచారం గుర్తింపునకు ఫేస్బుక్ నూతన చర్యలు ఉపయోగపడతాయి' అని వాల్ల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
ఇదీ చూడండి:'ఆ దేశంతోనే అమెరికా భద్రతకు అతిపెద్ద ముప్పు'