ETV Bharat / international

ఫైజర్​ 'కరోనా వ్యాక్సిన్'​ 90శాతం ప్రభావవంతం! - pfizer vaccine news update

కరోనా వైరస్​ను నియంత్రించడంలో ఫైజర్ వ్యాక్సిన్​ మెరుగైన ఫలితాలు సాధిస్తోందని ఆ సంస్థ వెల్లడించింది. ఇప్పటివరకు మానవులపై నిర్వహించిన పరీక్షల్లో 90శాతం మేర కచ్చితమైన ప్రభావం చూపించిందని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన తాజా సమాచారాన్ని విడుదల చేసింది.

Early data signals COVID-19 vaccine is effective: Pfizer
ఫైజర్​ వ్యాక్సిన్​తో 90 శాతంకు పైగా మెరుగైన ఫలితాలు
author img

By

Published : Nov 9, 2020, 7:25 PM IST

Updated : Nov 9, 2020, 9:58 PM IST

మానవులపై జరుపుతున్న తుది దశ కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలకు సంబంధించి వైరస్‌ను నియంత్రించడంలో తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్ 90 శాతం ప్రభావవంతంగా పనిచేసిందని ప్రపంచ ఫార్మ దిగ్గజం ఫైజర్ తెలిపింది. ఈమేరకు క్లీనికల్ ట్రయల్స్‌కు సంబంధించిన తాజా డేటాను విడుదల చేసింది. డిసెంబర్‌లో అత్యవసర ప్రాతిపదికన వ్యాక్సిన్‌ను ఉపయోగించేందుకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్​డీఏకు దరఖాస్తు చేసుకోనున్నట్లు పేర్కొంది. అయితే వ్యాక్సిన్‌ ఈ సంవత్సరంతానకి వచ్చే అవకాశాలపై మాత్రం ఫైజర్ స్పందించ లేదు.

తాజా ఫలితాలు వ్యాక్సిన్‌ ప్రభావశీలతపై నమ్మకాన్ని కలగజేస్తున్నాయని ఫైజర్‌ క్లీనికల్ అభివృద్ధి విభాగం ఉపాధ్యక్షుడు డాక్టర్ బిల్‌ గ్రూబర్ తెలిపారు. అమెరికా సహా...ఐదు ఇతర దేశాల్లో 44 వేల మంది మీద చేసిన క్లీనికల్ పరీక్షల్లో 94 మందికి వైరస్‌ సోకినట్లు గ్రూబర్‌ వివరించారు. జర్మనీకి చెందిన బయోన్‌ టెక్‌ తో కలిసి ఫైజర్ ప్రపంచవ్యాప్తంగా 10 వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేస్తోంది. అందులో 4 టీకా పరీక్షలపై అమెరికాలో విస్తృతంగా అధ్యయనం జరుపుతోంది.

ఇదీ చూడండి: దేశంలో మరో 45,903 మందికి కరోనా

Last Updated : Nov 9, 2020, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.