భారత్‌లో వాయుకాలుష్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్. తాను, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్.. భారత్‌తో మైత్రికి అత్యంత విలువనిస్తామన్నారు.
"భారత్‌ను అధ్యక్షుడు ట్రంప్ ఓ మురికి దేశంగా అభివర్ణించారు. మిత్ర దేశం గురించి మాట్లాడే తీరు ఇది కాదు. వాతావరణ మార్పు వంటి సమస్యను పరిష్కరించే విధానం ఇది కాదు. కమల, నేను భారత్‌తో బంధానికి ఎంతో విలువనిస్తాం. విదేశీ విధానాల్లో భారత్‌కు గౌరవం దక్కే విధంగా చర్యలు చేపడతాం."
--- జో బైడెన్, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి.
అధ్యక్ష పోరులో శుక్రవారం జరిగిన చివరి సంవాదంలో భాగంగా.. భారత్, చైనా, రష్యా దేశాలు వాయు కాలుష్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు ట్రంప్.
'నేను గెలిస్తే..'
తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్‌తో మైత్రిని మరింత దృఢపరిచేందుకు చర్యలు చేపడతానన్నారు బైడెన్. ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడతామని, శాంతిని ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. అమెరికా- భారత్‌లోని మధ్య తరగతి వారు ఎదిగేలా కృషి చేస్తానని హామీనిచ్చారు.
ఇదీ చూడండి:- ట్రంప్Xబైడెన్: చర్చంతా కరోనాపైనే..