ETV Bharat / international

కారెక్కిన ఆవు.. బర్గర్ల కోసం మెక్​డోనాల్డ్స్​కు..! - జెస్సికా నెల్సన్ ఫేస్​బుక్ ఆవు వీడియో

కారులో షికారుకు వెళ్లేటప్పుడు సరదాగా పెంపుడు శునకాన్ని తీసుకెళ్లడం మామూలే. మరి ఏకంగా ఓ ఆవును కారులో ఎక్కించుకుని వెళ్తే? ఏంటీ అంత పెద్ద ఆవు ఓ చిన్న కారులోనా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది చదివేయండి మరి..

కారెక్కిన ఆవు
కారెక్కిన ఆవు
author img

By

Published : Aug 28, 2021, 4:45 PM IST

జీవాలపై ఎంత ప్రేమ ఉన్నప్పటికీ శునకం, పిల్లిని తప్ప ఇతర జంతువులను కారులో షికారుకు తీసుకెళ్లలేం. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా మూడు ఆవులను కారులో తీసుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

అవాక్కయ్యా..!

అమెరికాలోని విస్కాన్సిన్‌లో నివసించే జెస్సికా నెల్సన్ అనే మహిళ కారులో వెళుతుండగా మెక్‌డొనాల్డ్స్ ఎదురుగా నిలిపి ఉంచిన కారులో ఓ ఆవు ఉండటాన్ని గమనించింది. దాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయదా అది వైరల్​గా మారింది.

మొదట కారులో ఆవును చూసి నమ్మలేకపోయనని నెల్సన్ తెలిపింది. అయినా.. కారులో ఆవులను ఎవరు ఎక్కించుకెళ్తారులే? అనుకున్నానని, అది ఆవు బొమ్మ అని భ్రమపడినట్లు తెలిపింది. అయితే.. ఆవు తల కదిలించడం వల్ల నమ్మకతప్పలేదని తెలిపింది.

కారెక్కిన ఆవు
కారెక్కిన ఆవు

ఆవు వీడియోను తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసిన ఆమె.. 'విస్కాన్సిన్​లో నివసిస్తున్న నాకు ఈ విషయం ఇంతవరకు ఎందుకు తెలియలేదు? మీ అందరికీ ఓ బ్రేకింగ్ న్యూస్ 'కారు వెనుక భాగంలో ఆవు!'.. అంటూ రాసుకొచ్చింది. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ వీడియో లక్షా 12వేల వీక్షణలతో దూసుకెళ్తోంది.

కారెక్కిన ఆవు
కారెక్కిన ఆవు

ఈ వీడియోను చూసిన ఆవు యజమాని తనను సంప్రదించినట్లు ఆ మహిళ అసోసియేటెడ్ ప్రెస్​కి తెలిపింది. బయటకు కనిపించింది చిన్న దూడేనని.. వెనుక సీట్లో మరో రెండు ఆవులు పడుకుని ఉన్నాయని.. వీటిని అప్పుడే కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లు ఆవు యజమాని వివరించారని తెలిపింది.

కారెక్కిన ఆవు
కారెక్కిన ఆవు

మొత్తంగా ఆ కారు అక్కడ ఎందుకు ఉంది? ఆవుల కోసం బర్గర్‌లు ఏమైనా ఆర్డర్ చేశాడా? అనే విషయం తనకు తెలియదని చెప్పింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.