ఎగసిపడుతున్న మంటలు.. ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన పొగ.. దగ్ధమవుతున్న ఇళ్లు.. వల్లకాడులా మారిపోయిన ఊరు. ఇవన్నీ చెబుతుంటే సినిమాలో ఓ సన్నివేశాన్ని వర్ణిస్తున్నట్లు ఉందికదూ. కానీ నిజం. అమెరికా కాలిఫోర్నియాలో కార్చిచ్చు సృష్టించిన విధ్వంసానికి సాక్ష్యాలు ఈ చిత్రాలు.
అడవులు, కొండలు సహా.. గ్రామాలను కూడా దహించివేస్తున్న కార్చిచ్చు దృశ్యాలు అత్యంత భీతిగొలిపేలా ఉన్నాయి. గ్రీన్విల్లే ప్రాంతంలో.. గ్యాస్ స్టేషన్, చర్చి, హోటల్, మ్యూజియం, బార్లు సహా ఏళ్ల నాటి ఇళ్లు అగ్ని ధాటికి దగ్ధమయ్యాయి.
టైలర్స్విల్లే, ఫ్లుమాస్, కౌంటీ ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని చదరపు కిలోమీటర్ల మేరకు కార్చిచ్చు వ్యాపించింది. గ్రీన్విల్లే పరిసర ప్రాంత ప్రజలను.. తమ నివాస ప్రాంతాలను విడిచిపెట్టాలని అధికారులు హెచ్చరించారు.
జులై 14న కాలిఫోర్నియాలో మొదలైన ఈ కార్చిచ్చు దాదాపు 1,305 కిలోమీటర్ల మేర వ్యాపించింది.