మధ్య అమెరికాలోని హోండురస్ జైలులో ఖైదీల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణలో 18 మంది చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. హోండురస్ రాజధాని తెగుసిగల్పాలోని ఎల్ పోర్వనిర్ జైలులో జరిగిన ఈ ఘర్షణలో తుపాకులు, వేట కత్తులు వాడారని పోలీసులు తెలిపారు.
రెండు రోజుల క్రితం హోండురస్ ఉత్తర టెలా ఓడరేవు పట్టణంలోని జైల్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇందులో సుమారు 18మంది చనిపోగా 16మంది గాయపడ్డారు.
భద్రత పెంపునకు ఆదేశాలు..
ఈ ఘటనతో అప్రమత్తమయిన హోండురస్ అధ్యక్షుడు జువాన్ ఓర్లాండో హెర్నాండెజ్... జైళ్లలో భద్రత పెంపునకు ఆదేశించారు. దేశంలోని 27 జైళ్లను సైన్యం, పోలీసులు పూర్తి నియంత్రణలోకి తీసుకోవాలని చెప్పారు.
హోండురస్ జైళ్లలో 21వేల మంది ఖైదీలు ఉన్నారు. ఇందులో 18 జైళ్లు ప్రమాదకరమైనవిగా గుర్తించింది సైన్యం.
ఇదీ చూడండి: హోండురస్ జైల్లో 18 మంది ఖైదీలు మృతి