దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్(New covid variant ) 'ఒమిక్రాన్'.. ప్రపంచ దేశాలను కలవరపరుస్తోంది. వైరస్ భయంతో అనేక దేశాలు కట్టడి చర్యల్ని కఠినంగా అమలు చేస్తున్నాయి. ఒమిక్రాన్ వెలుగు చూసిన దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బోట్స్వానా తదితర దేశాల నుంచి రాకపోకలు నిలిపివేస్తున్నాయి. ప్రపంచ దేశాలు ఇలా వరుసపెట్టి తమపై ప్రయాణ ఆంక్షలు విధించడాన్ని దక్షిణాఫ్రికా(International travel ban south africa) తీవ్రంగా పరిగణించింది. ఇది తప్పుడు నిర్ణయమని, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నియమావళికి విరుద్ధమని తెలిపింది. ప్రపంచ సమస్యను కలిసి పరిష్కరించాల్సిన తరుణంలో కొన్ని దేశాలు బలిపశువులను వెతుకుతున్నాయని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఒమిక్రాన్ కట్టడి కోసం ప్రభుత్వాలు(Omicron precautions) చేయకూడనివి ఏంటి? తక్షణమే చేయాల్సినవి ఏంటో దక్షిణాఫ్రికాలోని యూనివర్సిటీ ఆఫ్ విట్వాటర్సాండ్కు(University of the witwatersrand) చెందిన ప్రొఫెసర్ షబీర్ ఏ మాది ఇలా వివరిస్తున్నారు.
చేయకూడనివి..
1. ఎక్కువ నిబంధనలు వద్దు..
ఇండోర్ ప్రదేశాల్లో జనం గుమికూడటాన్ని నివారించడం మినహా... ఇంకా ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. మూడు వేవ్‌లను ఎదుర్కొన్న దక్షిణాఫ్రికాలో ఈ తరహా ఆంక్షలు గతంలో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. వైరస్ బాధితుల సంఖ్య పెరగకుండా నివారించలేకపోయాయి. ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపే ఈ నిబంధనలు విధించినప్పటికీ.. 2-3 వారాల్లోనే అనేక మంది వైరస్ బాధితులుగా మారారు. దక్షిణాఫ్రికాలో పేదలు అధిక సంఖ్యలో ఉన్నందున ఈ తరహా నిబంధనలు విధించడం వల్ల వారిపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ఇదీ చూడండి: covid new variant: కరోనా కొత్త వేరియంట్.. డెల్టా కంటే ప్రమాదకరమా?
2. ప్రయాణాలను నిషేధించవద్దు.
ప్రయాణాలపై నిషేధం విధించినప్పటికీ గతంలో వైరస్ ఒకచోట నుంచి మరో చోటుకి వ్యాప్తి చెందింది. ప్రయాణాలను నిషేధిస్తే వైరస్ వ్యాప్తి చెందదని భావించడం అమాయకత్వమే అవుతుంది. ఓ ద్వీపం లాంటి దేశంలో ఉంటే తప్ప వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండదు.
ప్రయాణాలపై నిషేధం విధించడం కంటే ముందే... ఒమిక్రాన్ వేరియంట్ ఇతర దేశాలకు వ్యాప్తి చెంది ఉంటుంది. అందుకు బెల్జియం ఉదాహరణ. దక్షిణాఫ్రికాతో సంబంధం లేని ఓ వ్యక్తికి అక్కడ ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు నిర్ధరణ అయింది. బ్రిటన్, ఇజ్రాయెల్, జర్మనీలో నమోదైన కేసుల్లోనూ(Omicron cases in world) ఇలాగే జరిగింది.
ప్రయాణాలపై ఆంక్షలు విధించడం కంటే.. విమానాశ్రయాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ సమయాల్లో కఠిన నిబంధనలు పాటించాలి. స్క్రీనింగ్ పరీక్షలను(Screening covid 19) కచ్చితంగా చేయాలి. వ్యాక్సిన్ వేసుకున్నవారినే అనుమతించడం వంటివి చేయాలి.
3. అతి ఆంక్షలు వద్దు..
స్థానికంగా ఎవరూ అమలు చేయలేని నిబంధనలు విధించాలని ఆదేశించవద్దు. ఉదాహరణకు ఆల్కహాల్ అమ్మకంపై నిషేధం విధించడం వంటివి చేస్తే.. బ్లాక్ మార్కెట్ విజృంభించే అవకాశం ఉంటుంది. అది పేదలకు తీరని నష్టం చేకూరుస్తుంది.
ఇదీ చూడండి: కరోనా కొత్త వేరియంట్‌పై భారత్ కీలక ప్రకటన- ఆ దేశాల్లో ఆంక్షలు
4. వారిని గుర్తించడం మర్చిపోవద్దు.
వైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉన్న వ్యక్తులను గుర్తించాలి. 65 ఏళ్ల పైబడిన వారికి కరోనా టీకా బూస్టర్ డోసు(Vaccine booster dose) అందించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు బూస్టర్ డోసు అందించేందుకు చర్యలు చేపట్టాలి.
5.హెర్డ్ ఇమ్యూనిటీపై ఆధారపడొద్దు..
కరోనాను నియంత్రించేందుకు హెర్డ్ ఇమ్యూనిటీపై ఆధార పడడం పరిష్కారం కాదు. అది ఇప్పట్లో సాధ్యం కాదు. దాని వల్ల వ్యాక్సిన్లపై నమ్మకం పోతుంది. వైరస్‌ను ఎదుర్కోవడంలో టీకాలు ప్రభావవంతంగా పని చేస్తున్నాయని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. హెర్డ్ ఇమ్యూనిటీకి బదులుగా.. వైరస్‌తో కలిసి ఎలా జీవించాలో నేర్చుకోవాలి.
ఇదీ చూడండి: అత్యంత వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి.. ప్రపంచ దేశాల గజగజ
తక్షణం పాటించాల్సిన అంశాలు..
1. వైద్య వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాలి. వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు సరిపడా వైద్య సిబ్బందిని నియమించుకోవాలి. ఆక్సిజన్, వెంటిలేటర్, ఔషధాలు వంటి వాటిని సమకూర్చుకోవాలి.
2. బూస్టర్ డోసు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలి.
3. వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ విధానాన్ని పాటించాలి. ప్రయాణాల్లో, ఇండోర్ సమావేశాల్లో వ్యాక్సిన్ వేసుకున్నవారినే అనుమతించేలా చర్యలు తీసుకోవాలి.
4. వ్యాక్సిన్ తీసుకోనివారికి, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి టీకాలు వేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి.
5. వైరస్ ప్రభావానికి అధికంగా గురయ్యే వారికి గుర్తించి వారికి తక్షణమే వ్యాక్సిన్ అందించాలి.
6. ప్రజలంతా కరోనా నిబంధనలు కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలి. నిబంధనలు పాటించనివారికి జరిమానాలు విధించాలి.
7. స్థానికంగా ఉండే ఆస్పత్రుల్లో కూడా పడకల వసతిని పెంచాలి.
8. వైరస్‌తో కలిసి జీవించడం అలవర్చుకోవాలి.
9. సైన్స్ ఏం చెబుతుందో దాన్ని పాటించాలి. రాజీకీయాల ప్రయోజనాల కోసం దాన్ని వక్రీకరించొద్దు.
10. గతంలో చేసిన పొరపాట్ల నుంచి నేర్చుకుని.. ఆ తప్పులు మళ్లీ చేయకుండా సరైన దిశలో అడుగులు వేయాలి.
ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం ప్రయాణాలపై ఆంక్షలు విధించడం ఎంత మాత్రం పరిష్కారం కాదని ఆస్ట్రేలియాలో యూఎన్ఎస్డబ్లూ గ్లోబల్ హెల్త్ ప్రొఫెసర్ ఆంథోని జ్వీ అభిప్రాయపడ్డారు. టెస్టింగ్, ట్రేసింగ్, ఐసొలేషన్ సహా కరోనా నిబంధనలు పాటించడం, నిరంతర నిఘా ఉంచడం ద్వారా వైరస్‌ను కట్టడి చేయవచ్చని చెప్పారు.
ఇవీ చూడండి: