ETV Bharat / headlines

కొవిడ్ కేర్ సెంటర్లలో యోగా పాఠాలు - guntur district latest corona news

కరోనా బాధితులు త్వరగా కోలుకునేందుకు యోగా మంత్రాన్ని అవలంభిస్తున్నారు గుంటూరు జిల్లా అధికారులు. వైరస్ సోకిన వారికి వైద్యులతో చికిత్స అందిస్తూనే యోగాభ్యాసం చేయిస్తున్నారు. పతంజలి యోగా గురువు శ్రీనివాస్​ ఆధ్వర్యంలో ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. వైరస్ సోకిందని ఎంతో ఆవేదనతో ఉండే తమకు ఈ యోగా తరగతులు స్వాంతన చేకూర్చాయంటున్నారు కొవిడ్ బాధితులు.

Yoga classes at covid Care
Yoga classes at covid Care
author img

By

Published : Nov 7, 2020, 10:19 AM IST

కొవిడ్ బాధితుల ఆరోగ్యం మెరుగుపర్చడానికి ఆసనాల అస్త్రం సంధిస్తోంది గుంటూరు జిల్లా యంత్రాంగం. కొవిడ్ కేరే సెంటర్లలో యోగా పాఠాలు చెప్పిస్తోంది. పతంజలి యోగా గురువు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ తరగతులు జరుగుతున్నాయి. ముందుగా జీవన విధానం ఎలా ఉండాలో చెబుతారు. అంటే సూర్యోదయానికి ముందు లేవటం, ఎక్కువగా నీరు తాగటం, రోజుకు రెండు లీటర్ల మేర మూత్ర విసర్జన చేయటం, వీలైతే మూడు పూటలా మల విసర్జనకు వెళ్లాలని సూచిస్తారు. అలాగే ఆహార ధర్మం గురించి వివరిస్తారు. రోగ నిరోధక శక్తి పెంచుకోవటం ఎలాగో అవగాహన కల్పిస్తారు. వీటితో పాటు శ్వాస ప్రక్రియ సజావుగా సాగేలా ప్రాణాయామాలు, శారీరక ధృడత్వం కోసం సూర్య నమస్కారాలు, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం నేర్పిస్తున్నారు. వ్యాధి బారిన పడ్డామన్న ఆందోళనలో ఉన్న వారికి ఇవన్నీ ధైర్యాన్ని ఇస్తాయని యోగా గురువు శ్రీనివాస్ తెలిపారు.

నాలుగు నెలలుగా నిర్వహణ

వారం రోజుల పాటు నిత్యం దాదాపు గంటన్నర పాటు యోగా తరగతులు సాగుతాయి. ఆ తర్వాత వేరే కేంద్రంలో మరో వారం రోజులు నిర్వహిస్తారు. ఇలా గుంటూరుతో పాటు నర్సరావుపేట, తెనాలి కొవిడ్ కేంద్రాల్లోనూ గత నాలుగు నెలలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పాజిటివ్​గా తేలిన వెంటనే ఎంతో ఆవేదనతో ఉన్న తమకు యోగా తరగతులు స్వాంతన చేకూర్చాయంటున్నారు బాధితులు. శ్వాస సమస్యలు, ఒంటి నొప్పులు దూరమయ్యాయని తెలిపారు. తాము కోలుకుని ఇళ్లకు వెళ్లిన తర్వాత కూడా యోగా చేయటం కొనసాగిస్తామని చెప్పారు.

సంయుక్త కలెక్టర్ ఆలోచనతో

కొవిడ్ కేర్ సెంటర్లకు వచ్చే వారిలో ఆత్మన్యూనతా భావం, ఆందోళన గమనించారు అధికారులు. వాటినుంచి దూరం చేసేందుకు యోగా మంచి మార్గమని జిల్లా సంయుక్త కలెక్టర్ దినేశ్ కుమార్ భావించారు. పతంజలి యోగాలో నిపుణుడైన శ్రీనివాస్​ను పిలిపించారు. వైరస్ బాధితులకు నేరుగా యోగా నేర్పటం సాహసమనే చెప్పాలి. కానీ శ్రీనివాస్ అందుకు అంగీకరించారు. మొదట్లో అడవితక్కెళ్లపాడు కేంద్రంలో యోగా తరగతులకు శ్రీకారం చుట్టారు. అక్కడ రెండు వారాలు ఫలితాలు చూశాక మిగతా కేంద్రాల్లోనూ మొదలు పెట్టారు. యోగా తరగతుల వల్ల కొవిడ్ బాధితుల్లో చాలా మార్పులు గమనించినట్లు సంయుక్త కలెక్టర్ దినేశ్ కుమార్ చెప్పారు. బాధితుల్లో ఒంటరితనం పోయి కుటుంబ వాతావరణం ఏర్పడిందని వివరించారు.

శ్రీనివాస్ సాహసం

మాస్కులు, పీపీఈ కిట్లు వంటివి వేసుకోకుండానే ఈ తరగతులు నిర్వహిస్తున్నారు శ్రీనివాస్. తాను అవన్నీ ధరిస్తే... బాధితులకు ధైర్యం ఎలా చెప్పగలనని... అందుకే ప్రత్యక్షంగా వారితో మాట్లాడుతూ కార్యక్రమం పూర్తి చేస్తానని ఆయన వెల్లడించారు. శ్రీనివాస్ అందుబాటులో లేని సమయంలో ఆయన శిష్యులు ఈ తరగతుల్ని నిర్వహిస్తుంటారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.