ETV Bharat / entertainment

'జబర్దస్త్ టీమ్​ లీడర్ల కష్టం మామూలుగా ఉండదు.. 7 నిమిషాల స్కిట్​ కోసం...' - jabardast kevvu karthik shows

తమ స్కిట్​లతో ప్రేక్షకుల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తారు 'జబర్దస్త్'​ కమెడియన్స్​. స్టేజ్​ ఏదైనా అదిరిపోయే పంచ్​లు, కామెడీ టైమింగ్​తో కితకితలు పెట్టిస్తారు. అయితే వీరిలో కొంతమంది తమ ప్రతిభతో టీమ్​లీడర్లుగా ఎదిగారు. తాజాగా ఈటీవీ భారత్​తో ముచ్చటించిన వీరు​​.. తమ స్కిట్​లను రూపొందించడానికి ఎంతలా కష్టపడతారో వివరించారు. ఆ సంగతుల్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం..

Jabardast teamleaders
జబర్దస్త్​ టీమ్​ లీడర్స్​
author img

By

Published : Jun 13, 2022, 6:16 PM IST

Updated : Jun 13, 2022, 7:16 PM IST

'జబర్దస్త్ టీమ్​ లీడర్ల భేజా ఫ్రై'

వెండితెరపై సినిమాలు.. ప్రేక్షకులకు ఎంతటి వినోదాన్ని పంచుతాయో.. అలానే బుల్లితెరపై పలు ఎంటర్​టైన్​మెంట్​ షోస్ కూడా వీక్షకులకు అంతే సరికొత్త వినోదాన్ని ఇస్తాయి. ​రోజూ రకరకాల ఆలోచనలు, పనులతో సతమతమయ్యే ప్రేక్షకుడు.. టెన్షన్స్​ను కాసేపు మర్చిపోయి కడుపుబ్బా నవ్వించేలా చేస్తాయి. అయితే వీటిని తెరకెక్కించడం అంత సులభమేమీ కాదు. ఓ సినిమాను రూపొందించడంలో ఎంతటి కష్టం దాగి ఉంటుందో ఈ స్పెషల్​ షోస్​ వెనుక కూడా అంతే కష్టం, శ్రమ ఉంటుంది. వీక్షకుడికి కొత్తదనాన్ని చూపించాలనే తాపత్రయంతో మేకర్స్​ నిత్యం కష్టపడుతుంటారు. వ్యూయర్స్​కు ఆనందాన్ని పంచేందుకు వారు శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతుంటారు. కాన్సెప్ట్స్​ను​ సెలెక్ట్​ చేసుకోవడం నుంచి షూటింగ్​ పూర్తై టెలికాస్ట్​ అయ్యే వరకు శ్రమిస్తుంటారు. అయితే బుల్లితెరపై కడుప్పుబ్బా నవ్వించే ప్రోగ్రామ్స్​లో ఎంతో క్రేజ్​ సంపాదించుకున్నాయి ఖతర్నాక్​ షోస్​ 'జబర్దస్త్​', 'ఎక్స్‌ట్రా జబర్దస్త్‌'. ఇందులో కొంతమంది కమెడియన్లు కంటెస్టెంట్​లుగా షోలో అడుగుపెట్టి టీమ్​లీడర్లుగా ఎదిగారు. వారు వేసే పంచులు, చేసే కామెడీ.. మొత్తంగా వారు ప్రదర్శించే స్కిట్​ ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈటీవీ భారత్​తో ముచ్చటించిన ఈ టీమ్​లీడర్లు.. తాము చేసే స్కిట్స్​ వెనుక ఎంతటి శ్రమ, కష్టం ఉంటుందో తెలిపారు. ఎంతగా కష్టపడతారో వివరించారు. కొత్తదనం చూపించేందుకు ఎంతలా తాపత్రయం పడతారో చెప్పుకొచ్చారు. అవన్నీ వారి మాటల్లోనే.. ​

Jabardast
రోహిణి

రోహిణి మాట్లాడుతూ.. "మొదట సాఫ్ట్​వేర్​ జాబ్​ వచ్చింది. ఓ సారి లంచ్ బ్రేక్​లో సహచరులను ఎంటర్​టైన్​ చేస్తున్నా. అది చూసిన మా సార్​ యాక్టింగ్​ అంటే ఆసక్తి ఉందా? అని అడిగారు. ఆ సమయంలోనే మా అక్క కూడా నన్ను ప్రోత్సహించింది. ఆ తర్వాత ఆరు నెలల్లోనే సీరియల్స్​లో అవకాశం వచ్చింది. అలా 'జబర్దస్త్'​లోకి వచ్చా. చమ్మక్​ చంద్ర టీమ్​లో చేశా. అనంతరం యాక్సిడెంట్​ అయి షోకు కాస్త దూరమయ్యా. మళ్లీ సీరియల్స్​, టీవీ షో.. అనంతరం మళ్లీ కంటెస్టెంట్​గా ఎంట్రీ ఇచ్చా. అయితే కంటెస్టెంట్​గా ఉన్నప్పుడు పెద్దగా ఒత్తిడి ఏమీ ఉండదు. వాళ్లు చెప్పింది చేసి వెళ్లిపోతా. కానీ ఇప్పుడు టీమ్​లీడర్​ అయ్యాక ఫుల్​ టెన్షన్​. కష్టమైన పనే అయినా ఇష్టం కాబట్టి సంతోషంగానే ఉంది. సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ప్రేక్షకులకు దగ్గరవ్వడానికి 'జబర్తస్త్​' మంచి ప్లాట్​ఫామ్​. ఇలానే నవ్విస్తూ ఇంకా బాగా చేయాలని ప్రయత్నిస్తా. నన్ను ఆదిరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ఇది ఒక్క గొప్ప వరంగా భావిస్తున్నా. మొత్తంగా ఈ షోలో భాగస్వామ్యం అవ్వడం సంతోషంగా ఉంది." అని చెప్పింది.

"నేను జంగిల్​ బుక్​ అనే స్కిట్​ చేశా. చాలా డిఫరెంట్​గా ఉంటుంది. నిజానికి బిహైండ్​ ది కెమెరా చాలా కష్టం దాగి ఉంటుంది. ఆలోచించాలి, లైన్స్ రాయాలి, దాన్ని డైరెక్టర్​కు చెప్పాలి. ఆయన ఓకే చెబితే, మళ్లీ డైలాగ్స్​ రాయాలి. ఆ తర్వాత ఆర్టిస్ట్​ సెలక్షన్​, ప్రాక్టీస్, షూట్​ చేయడం జరుగుతుంది. దాదాపు ఈ ప్రక్రియ అంతా ఓ సినిమాకు జరిగినట్టే కొనసాగుతుంది. సినిమాకైనా కాస్త టైమ్​ ఉంటుంది కానీ మాకు మాత్రం ఓ వారమే సమయం ఉంటుంది. ఇప్పటికే చాలా కథలు వచ్చేశాయి. కొత్త కథల రాయడం చాలా టఫ్​. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాం. బుర్ర హీటెక్కిపోతుంది."
-కెవ్వు కార్తీక్​

Jabardast
కార్తీక్, అవినాష్

రాకెట్​ రాఘవ​ మాట్లాడుతూ.. "ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి దాదాపుగా ప్రతి ఎపిసోడ్​ చేస్తున్నాను. నాకు ఇలా అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉంది. షూట్​ చేసే ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే రోజూ దాని కోసం బాగా వర్క్​, ప్రాక్టీస్​ చేయాలి. దాన్ని మా డైరెక్టర్​ ఓకే చేయాలి. చాలా మధనపడుతుంటాం. కొత్తగా ఏదో చేయడానికి ప్రయత్నిస్తుంటూనే ఉంటాం. అలానే కొనసాగిస్తుంటాం. ఇదంతా టీమ్​ వర్క్​. కలిసి చర్చిస్తాం. ఒకరికి నచ్చొచ్చు.. ఇంకొకరికి నచ్చకపోవచ్చు. చివరికి ఓ నిర్ణయానికి వస్తాం. తొమ్మిదేళ్ల నుంచి చేయడం వల్ల మా మధ్య ఓ ఎమోషన్​ ఎప్పుడూ ఉంటుంది. అంతా ఒక ఫ్యామిలీ అయిపోయాం. అవసరమైనప్పుడు సాయంగా ఒకరికి కోసం ఒకరు తోడుగా ఉంటాం." అని పేర్కొన్నాడు.

"జబర్దస్​లో ఉన్న మిగతా వాళ్ల లాగే నాకంటూ ఓ గుర్తింపు రావాలని అనుకున్నాను. కన్ఫ్యూజన్​​ స్కిట్​ను ఎంచుకున్నాను.​ నా టీమ్ కూడా బాగా​ సపోర్ట్ చేసింది​. మిగతా స్కిట్​లా కాకుండా దీనికి పేపర్ వర్క్​ ఎక్కువగా ఉంటుంది. దాదాపు వారం వరకు పడుతుంది. మూడు రోజులు ప్రాక్టీస్​ చేస్తాం. అప్పుడు పక్కాగా ప్రజెంట్ చేస్తాం. లేదంటే స్టేజ్​పై ప్రదర్శన చేయడం కష్టం. మా టీమ్​ వాళ్లు బాగా సహకరిస్తారు, ప్రోత్సహిస్తారు. సాయి, హరిత, రమేశ్​.. అంతకుముందు ఇమ్ము ప్రసాద్​, బాబు బాగా సహకరించారు."

- వెంకీ

బుల్లెట్​ భాస్కర్​ మాట్లాడుతూ.. "కొంతమంది అంటుంటారు బోర్​ కొట్టలేదా అని? .. కామెడీ , లవ్​ ఎప్పటికీ బోర్​ కొట్టదు. దేవదాస్​ వచ్చి 50 ఏళ్లు అయింది. అయినా ప్రేమ కథలు తీస్తున్నారు. క్రియేటివిటీ ఉన్నంతవరకు ఎండింగ్​ లేదు. ఎత్తుపల్లాలు ఉండటం సహజం​. ఒకవేళ మా షోకి రేటింగ్​ తక్కువ వచ్చినా వెంటనే పికప్​ అవుతుంది. పేరు రావడం చాలా ఈజీ. కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. దాని కోసం కష్టపడే క్రమంలో ఒత్తిడికి గురవుతాం. ఇలా ఓ సారి నేను సైకియాట్రిస్ట్​ దగ్గరకు వెళ్లాను. అప్పుడు ఆయన 'నేను ఒత్తిడికి లోనైతే జబర్దస్త్​ చూస్తాను అన్నారు'. ఓ రియాలిటీ షో ఇన్ని సీజన్స్​ కొనసాగడం ప్రపంచంలోనే తొలిసారి. దేవుడి దయ వల్ల అంతా బాగా జరుగుతుంది. మిమ్మల్ని న్వవించడానికి ఎప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటాం." అని అన్నాడు.

ఇదీ చూడండి: 'జబర్దస్త్​ వల్లే మా అమ్మకు మంచి వైద్యం.. కానీ ఆ విషయంలో మాత్రం..'

Last Updated : Jun 13, 2022, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.