కుర్రకారు చూపు తిప్పుకోలేనంత అందం ఆమె సొంతం. అందానికి తోడు అభినయం ఆమె సొత్తు. తను నటించిన యారా ఆల్బమ్ ఇప్పటి వరకూ 386 మిలియన్ల మంది వీక్షకులను సంపాదించింది. ఇష్టంగా పని చేసి సెలబ్రిటీ స్థాయికి ఎదిగింది. అరిష్ఫ ఖాన్ యూట్యూబ్ ఛానల్లో మేకప్ చిట్కాలను చెబుతూ లక్షల్లో సంపాదిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.
ప్రముఖ నటి, బ్యుటీషియన్ అయిన అరిష్ఫ ఖాన్ 2003 ఏప్రిల్ 3 వ తేదీన ఉత్తర ప్రదేశ్ షాజహాన్‌పూర్‌లో జన్మించింది. యూపీలో పుట్టినా దిల్లీలోని రెయాన్ ఇంటర్ నేషనల్ స్కూల్లో తన విద్యాభ్యాసం చేసింది. అరిష్ఫాని కుటుంబ సభ్యులు ముద్దుగా అషు అని పిలుచుకుంటారు. తను చిన్నతనం నుంచే స్నేహితులతో, బంధువులతో ఎంతో ఉత్సాహంగా ఉండేది. డాన్స్ చేయండం ఇష్టపడేది. ఆ అభిరుచులే తనని సోషల్‌మీడియా వైపు నడిపాయి. అరిష్ఫకి పెంపుడు జంతువులంటే మహా ఇష్టం. తనొక శునకాన్ని పెంచుకుంటోంది. తను చైనీస్ ఆహారం అమితంగా ఇష్టపడుతుంది.
అరిష్ప డాన్స్ చేయడంతో పాటు నటనపై మక్కువ పెంచుకుంది. డాన్స్ వీడియోలను టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడం ద్వారా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అవి పాపులర్ కావడంతో అభిమానులు మిలయన్ల కొద్దీ పెరిగారు. భారత్‌లో టిక్‌టాక్ బ్యాన్ అయ్యే సమయానికి అరిష్ఫ ఖాన్ ఖాతలో 25 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె ఎంతలా కష్టపడిందో అర్ధం అవుతుంది.
అరిష్ఫ తల్లి అర్షి నాజ్‌తో కలిసి ముంబయిని సందర్శించినప్పుడు....ఆమె ఓ ప్రముఖ టీవీ షోలో ప్రసారమయ్యే ఛల్- షెహ్-ఔర్ ధారావాహిక కోసం మొదటిసారిగా 2012 సంవత్సరంలో ఆడిషన్‌కి వెళ్లింది. అందులో ఎంపికయ్యి గీతాంజలి అనే పాత్రను పోషించి మెప్పించింది. ఆ తరవాత ఏక్ వీర్‌కి అర్దాస్, జీని ఔర్ జుజు, ఉత్తరణ్, మేరీ దుర్గా, పాపా బై వంటి సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. . అరిష్ఫ ఖాన్ నాటికల్లోనే కాకుండా వివిధ టీవీ ప్రకటనల్లో కనిపించింది. అనేక హిందీ, పంజాబీ మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించింది. ఇలా తన ఆశయం కోసం ఎంతగానో కష్టించేది.
అరిష్ఫ తన య్యూట్యూబ్ ఛానల్‌లో బ్యుటీషియన్ పాఠాలు, సౌందర్య సాధనాల వినియోగం గురించి చెబుతుంది. సోషల్‌మీడియాలోనే కాదు.. వ్యాపారంలోను ఈ అమ్మడు దిట్టే..18 ఏళ్ల వయసులోనే తన మేనేజర్‌తో కలిసి సొంత మేకప్ బ్రాండ్ మిషి కాస్మేటిక్స్‌ను ప్రారభించింది.. చర్మ సౌందర్య క్రీములను , లిప్‌స్టిక్‌లు మొదలైన ఉత్పత్తులను ప్రారంభించింది . తన సహనటుడు డానిష్ జెహెన్ ఆకస్మిక మరణానికి సంబంధించి కొన్ని విమర్శలను ఆరిష్ఫ, కుటుంబం ఎదుర్కొంది.. బాలనటిగా ప్రస్థానం మొదలు పెట్టి చిన్న వయస్సులోనే అత్యంత విజయవంతమైన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, వ్యాపారవేత్తగా ఎదిగింది .
ఇది చదవండి : ఏది చేసినా ఆ ప్రేమ కోసమే .. నా వల్ల బాధపడి ఉంటే సారీ : ప్రియా ప్రకాశ్ వారియర్
Conclusion: