ETV Bharat / entertainment

'కనెక్ట్‌' సినిమాకు ఇంటర్వెల్‌ ఉండదు.. కారణమిదే : డైరెక్టర్‌ అశ్విన్​ - నయనతార సినిమాలు

లేడీ సూపర్​స్టార్​ నయనతార తాజాగా నటించిన చిత్రం కనెక్ట్. అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్​ ఉండదని మేకర్స్​ తెలిపారు. అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో డైరెక్టర్​ అశ్విన్​ శరవణన్ చెప్పారు.​

Nayanthara Connect Movie:
Nayanthara Connect Movie:
author img

By

Published : Dec 18, 2022, 11:07 AM IST

Nayanthara Connect Movie: "ప్రేక్షకులు చూపు తిప్పుకోకుండా చూసే సినిమాలు తెరకెక్కించడానికి ఇష్టపడతాను. గతంలో నేను చేసిన సినిమాలు అలాంటివే. ఇప్పుడు చేసిన 'కనెక్ట్‌' కూడా ఆ తరహా చిత్రమే" అన్నారు దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌. నయనతార కథానాయికగా 'మయూరి', తాప్సీ లీడ్‌ రోల్‌లో 'గేమ్‌ ఓవర్‌' వంటి చిత్రాలను తెరకెక్కించారు అశ్విన్‌ శరవణన్‌. మళ్లీ నయనతార కథానాయికగా ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'కనెక్ట్‌'. ఈ నెల 22న యూవీ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది.

ఈ సందర్భంగా అశ్విన్‌ శరవణన్‌ మాట్లాడారు. "హారర్‌ థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌తో 'కనెక్ట్‌' చిత్రాన్ని రూపొందించాను. లాక్‌డౌన్‌లో పనుల మీద వేరే ప్రాంతానికి వెళ్లినవాళ్లు కుటుంబానికి దరంగా అక్కడే స్ట్రక్‌ అయ్యారు. అలా ఓ తల్లీకూతురు ఒక ఇంట్లో ఉండిపోతారు. అయితే కొన్ని రోజులకు కూతురు ప్రేతాత్మ ఆవహింనట్లు ప్రవర్తిస్తుంటుంది. అప్పుడు కూతుర్ని కాపాడుకోవడానికి ఆ తల్లి ఏం చేసింది? అనేది కథ. మామూలుగా హాలీవుడ్‌ చిత్రాలకు ఇంటర్వెల్‌ ఉండదు. కథ ఒక ఫ్లోలో వెళుతున్నప్పుడు విరామం ఇస్తే ప్రేక్షకులు డైవర్ట్‌ అవుతారని పెట్టరు. మా 'కనెక్ట్‌'కు కూడా ఉండదు. ఈ సినిమా నిడివి గంటన్నర మాత్రమే. అదే మూడు గంటల సినిమా అయితే ఇంటర్వెల్‌ ఇవ్వాల్సి వచ్చేది. ఇక నయనతార మంచి నటి. ఆమె ఈ కథ విని అంతర్జాతీయ స్థాయి సినిమాగా నిర్మిస్తే బాగుంటుందనుకున్నారు. అందుకే తన భర్త విఘ్నేశ్​తో కలిసి నిర్మించారామె" అన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.