ETV Bharat / entertainment

'వీర' హిట్​లు కొట్టిన 'సంక్రాంతి' డైరెక్టర్‌లు గోపి​, బాబీ.. మరి నెక్స్ట్ ఏంటి? - గోపీచంద్​ మలినేని అప్డేట్లు

వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో.. డైరెక్టర్లు బాబీ, గోపీచంద్ మలినేని రేంజ్ వేరే లెవల్‌కు వెళ్లిపోయింది. సంక్రాంతి బరిలోకి దిగిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయ భేరీ మోగించాయి. దీంతో వారిద్దరి తదుపరి ప్రాజెక్టులు ఏంటోనని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

what are the next projects of directors gopichand malineni and bobby

author img

By

Published : Jan 21, 2023, 5:03 PM IST

టాలీవుడ్​ స్టార్​ హీరో నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'వీరసింహారెడ్డి' నిలిచింది. 'అఖండ' సినిమా లైఫ్ టైమ్ వసూళ్లను కేవలం 8 రోజుల్లోనే 'వీరసింహారెడ్డి' బీట్ చేసింది. మరోవైపు కమ్ బ్యాక్ తర్వాత ఇండస్ట్రీ హిట్ కోసం ఎదురుచూసిన మెగాస్టార్ చిరంజీవికి.. 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. వింటేజ్ చిరంజీవిని చూసి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అయితే ఈ రెండు సినిమాల డైరెక్టర్లు.. గోపీచంద్ మలినేని, బాబీపైనే ఇండస్ట్రీ ఫోకస్ పెట్టింది. ఇంతటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన తర్వాత వీరిద్దరు నెక్స్ట్ ఏం సినిమాలు చేయబోతున్నారోనని అంతా మాట్లాడుకుంటున్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో గోపీచంద్​, బాబీలకు డిమాండ్ బాగా పెరిగిపోయిందట. బడా హీరోలు, నిర్మాతల నుంచి వీరికి అదిరిపోయే ఆఫర్లు వస్తున్నాయట. కానీ వీరు మాత్రం.. టాప్ హీరోలతోనే ప్రస్తుతం వర్క్ చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలందరూ పలు ప్రాజెక్ట్స్‌తో ప్రస్తుతం బిజీగా ఉండటంతో.. ఈ ఇద్దరు దర్శకులు వారి తదుపరి ప్రాజెక్ట్‌లను ప్రకటించడానికి కొంత సమయం పట్టనుందట.

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో గోపీచంద్ తన కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తికర సమాధానమిచ్చారు. తదుపరి సినిమాకు కథ సిద్దం చేసిన తర్వాతే హీరో గురించి ఆలోచించడం ప్రారంభిస్తానని ఆయన చెప్పారు. "ఓ సినిమా కోసం నేను ప్రభాస్‌తో చర్చలు జరుపుతున్నాను. అలాగే ఇతర హీరోలతో కూడా చర్చలు జరుగుతున్నాయి. కానీ ప్రస్తుతానికి ఏదీ కన్ఫామ్ కాలేదు. కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని.. తర్వాత నా తదుపరి చిత్రానికి సంబంధించిన పనులు ప్రారంభిస్తాను." అంటూ గోపీచంద్ చెప్పుకొచ్చారు.

'వీరసింహారెడ్డి' సినిమా విషయానికొస్తే.. గోపీచంద్​ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య రోర్​ మాములుగా లేదంటున్నారు అభిమానులు. జై బాలయ్య అన్న నినాదంతో థియేటర్లు దద్దరిల్లిపోయాయనే చెప్పాలి. ఇక బాలయ్య అటు యాక్షన్​తో పాట ఇటు సెంటిమెంట్​ను బ్యాలెన్స్​ చేసి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు.​ ఈ సినిమాలో నటించిన ఇతర తారలు దునియా విజయ్​, వరలక్ష్మీ శరత్​కుమార్​, శ్రుతిహాసన్​, హనీ రోజ్​ సైతం తమదైన శైలిలో నటించి సీన్స్​ పండించారు. ఇప్పటివరకు విడుదలైన రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా రూ.119 కోట్ల గ్రాస్​ సాధించినట్లు ట్రేడ్​ వర్గాల సమాచారం.

మరోవైపు, ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం 'వాల్తేరు వీరయ్య' సినిమా 8 రోజుల్లోనే రూ.100 కోట్లకుపైగా షేర్ వ‌సూళ్ల‌ను సాధించింది. చిరంజీవి, రవితేజ అన్నదమ్ములుగా నటించిన ఈ చిత్రం కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. చిరు, రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియెన్స్‌ను విపరీతంగా అలరించాయి. ప్రకాశ్​ రాజ్, బాబీ సింహ కీలక పాత్రల్లో నటించారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్‌తో సాగే ఈ సినిమాకు మ్యూజిక్​ డైరెక్టర్​ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.