ETV Bharat / entertainment

దూసుకెళ్తున్న 'పఠాన్'​ కలెక్షన్స్​.. 'వాల్తేరు'-'వీరసింహం'లో ఎవరు ముందున్నారంటే? - పఠాన్​ కలెక్షన్స్​

మెగాస్టార్​ చిరంజీవి-నందమూరి నటసింహం బాలకృష్ణ- షారుక్ పఠాన్ కలెక్షన్​ వివరాలు బయటకు వచ్చాయి. ట్రేడ్​ వర్గాల సమాచారం ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. ఆ వివరాలు..

Walteru veera simha pathaan collections
దూసుకెళ్తున్న 'పఠాన్'​ కలెక్షన్స్
author img

By

Published : Jan 31, 2023, 1:13 PM IST

మెగాస్టార్​ చిరంజీవి-నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన సినిమాలు 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహారెడ్డి'.. బాక్సాఫీస్ వద్ద జోరు ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. వాల్తేరు వచ్చి 18 రోజులు కాగా, వీరసింహా వచ్చి 19 రోజులు అయింది. తాజాగా ఈ చిత్రాల కలెక్షన్ వివరాలు వచ్చాయి.

వాల్తేరు వీరయ్యకు 18వ రోజు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో కలిపి రూ.56 లక్షలు వచ్చాయి. మొత్తంగా రూ.112.81కోట్ల షేర్​.. రూ.182.20కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటక ప్లస్​ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి రూ.8.05కోట్లు, ఓవర్సీస్​లో రూ.13.07కోట్లు వచ్చాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.133.93 కోట్ల షేర్​​.. రూ.228.40కోట్ల గ్రాస్​ వచ్చాయని సమాచారం.

వీరసింహారెడ్డి జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్​గా నిలిచింది. ఇందులో బాలయ్య సరసన శృతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున సినిమాను నిర్మించింది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రూ. 129.84 గ్రాస్​, రూ.76.91కోట్ల డిస్ట్రిబ్యూషన్​ షేర్​ వచ్చాయని తెలిసింది.

ఇక ఈ రెండు చిత్రాల తర్వాత రీసెంట్​గా జనవరి 25న రిలీజైన పఠాన్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. విడుదలకు ముందు విమర్శలతో టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచిన ఈ భారీ ప్రాజెక్ట్​ ఇప్పుడు విడుదల అనంతరం అత్యధిక వసూళ్లను సాధిస్తోంది. ఐదు రోజుల్లో రూ.500కోట్లకు పైగా వసూళ్లనను సాధించిన ఈ చిత్రం తాజాగా ఆరో రోజు కూడా మంచి వసూళ్లను కలెక్ట్ చేసింది. ఈ చిత్రం కేవలం ఆరు రోజుల్లో హిందీ వెర్షన్​లో రూ.296 కోట్ల నెట్​ సాధించింది. అంటే రూ.300కోట్ల మార్కుకు చేరుకుంది. దీంతో ఆమిర్ ఖాన్ నటించిన దంగల్​, సంజయ్​ దత్ సంజు రికార్డులను అధిగమించింది. ఈ మార్క్​కు చేరుకోవడానికి దంగల్​కు 13రోజులు, సంజూకు 16రోజుల సమయం పట్టింది. ఇక పోతే ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.555కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఆరో రోజు రూ.600కోట్ల మార్కుకు చేరువగా వచ్చింది. అయితే ఆరో రోజు ఎంత కలెక్ట్ చేసిందో సరిగ్గా స్పష్టత లేదు.

ఇదీ చూడండి: రెండు భాగాలుగా పవన్-సుజిత్​​ సినిమా.. ఒరిజినల్​ గ్యాంగ్​స్టర్​ అల్లు అరవిందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.