ETV Bharat / entertainment

స్టన్నింగ్​ లుక్స్​లో రామ్​ చరణ్​.. రియాక్టైన కత్రినా కైఫ్! - రామ్​ చరణ్ కొత్త సినిమా

టాలీవుడ్​ కథానాయకుడు రామ్​ చరణ్​ నటిస్తున్న ఆర్​సీ15 సినిమా షూటింగ్​​ న్యూజిలాండ్​లో జరుగుతోంది. కాగా జాపాన్​ వీధుల్లో దిగిన త్రోబ్యాక్​ ఫొటోలు​ రామ్​ చరణ్ తాజాగా షేర్ చేశారు. ఇప్పుడీ ఫొటోలు వైరల్​ అవుతున్నాయి. దీనిపై బాలీవుడ్​ తార కత్రినా కైఫ్​ రియాక్ట్​ అయ్యింది.

ram charan looks
రామ్​ చరణ్​
author img

By

Published : Nov 27, 2022, 4:02 PM IST

Updated : Nov 27, 2022, 9:32 PM IST

మెగా పవర్​ స్టార్​ రామ్​ చరణ్​ హీరోగా స్టార్​ డైరెక్టర్​ శంకర్​ రూపొందిస్తున్న చిత్రం 'ఆర్​సీ15'. ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ న్యూజిలాండ్​లో జరుగుతోంది. చరణ్​ షూటింగ్​లో బిజీగా ఉన్నా.. కొంత సమయం తీసుకుని ఆ దేశాన్ని చుట్టేస్తున్నారు. 'ఆర్​ఆర్​ఆర్'​ ప్రమోషన్లో భాగంగా జపాన్​​ వీధుల్లో దిగిన త్రోబ్యాక్​ ఫొటోలు షేర్​ చేశారు రామ్​ చరణ్. 'ఇంకా జపాన్​ ఆలోచనల్లోనే ఉన్నాను' అనే క్యాప్షన్​ను జోడించారు. ఈ ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి. ఈ పోస్ట్​ను బాలీవుడ్​ అందాల తార కత్రినా కైఫ్ లైక్​ చేసింది. కాగా కొత్త లుక్స్​లో కనిపిస్తున్న చరణ్.. ​అభిమానుల్లో జోష్​ నింపుతున్నాడు.

ram charan looks
న్యూ లుక్​లో రామ్​ చరణ్​

'ఆర్​సీ15'ను పొలిటికల్​ థ్రిల్లర్​గా భారీ బడ్జెట్​తో తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను దిల్​ రాజు నిర్మిస్తున్నారు. పూర్తిస్థాయి రాజకీయ కోణంలో సాగే కథ ఇది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్​ సరసన కియారా అడ్వాణీ ఆడిపాడనుంది. శ్రీకాంత్‌, అంజలి, నవీన్ చంద్ర ముఖ్య భూమికలు పోషిస్తున్నారు.

ప్రముఖ తమిళ నటుడు ఎస్‌జే సూర్య ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఆయన పాత్ర ఎంతో కీలకంగా, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని సమాచారం. కార్తిక్‌ సుబ్బరాజు ఈ చిత్రానికి కథ అందించగా.. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. జానీ మాస్టర్ ​కొరియోగ్రాఫర్​గా వ్యవహరిస్తున్నారు.

ఇవీ చదవండి: విజయ్ దేవరకొండకు ఊహించని షాక్ చివరకు ఇంట్లోనే

సెకెండ్​ ఇన్నింగ్స్​లో నటనతో అదరగొడుతూ.. పిల్లలతో 'మంచి అమ్మ' అనిపించుకుంటూ..

Last Updated : Nov 27, 2022, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.