ETV Bharat / entertainment

విక్రమ్@100 రోజులు.. కమల్​ వాయిస్​ ట్వీట్​ వైరల్​! - కమల్​హాసన్​ ట్విట్టర్​

కమల్​ హాసన్​ హీరోగా తెరకెక్కిన 'విక్రమ్​' సినిమా బాక్సాఫీస్​ వద్ద బ్లాక్​బస్టర్​ హిట్​గా నిలిచింది. ఈ చిత్రం తాజాగా వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కమల్​ చేసిన వాయిస్​ ట్వీట్​ వైరల్​గా మారింది.

Vikram Movie 100 Days
Vikram Movie 100 Days
author img

By

Published : Sep 10, 2022, 4:35 PM IST

Vikram Movie 100 Days : క‌మ‌ల్ హాస‌న్ హీరోగా లోకేష్ క‌న‌గ‌రాజ్‌ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం 'విక్ర‌మ్‌'. జూన్ 3న విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సంచల‌నం సృష్టించింది. త‌మిళంలో 'బాహుబ‌లి-2' రికార్డ్​ను బ్రేక్ చేసి ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. చాలా కాలం త‌ర్వాత క‌మ‌ల్‌కు 'విక్ర‌మ్' సినిమా భారీ విజ‌యాన్ని అందించింది. ఇక‌ దాదాపు నాలుగేళ్ల త‌ర్వాత క‌మ‌ల్.. వెండితెర‌పై క‌నిపించ‌డం వల్ల అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
తాజాగా ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. త‌మిళనాడులో ఇంకా రెండు మూడు థియేట‌ర్ల‌లో 'విక్రమ్'​ మూవీ ప్ర‌దర్శితమవుతుందంటే విశేషమే. ఈ నేపథ్యంలో క‌మ‌ల్ ఓ వాయిస్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్​ మీడియాలో వైర‌ల్​గా మారింది.

ఇప్ప‌టివ‌ర‌కు 'విక్రమ్​' చిత్రం అన్ని భాష‌ల్లో క‌లిపి దాదాపు రూ.450కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తెలుగులో రూ.10కోట్ల‌కుపైగా ప్రాఫిట్స్ వ‌చ్చాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ ఫహద్ ఫాజిల్‌, తమిళ స్టార్ విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సూర్య రోలెక్స్ పాత్ర‌లో 5 నిమిషాలు మెరిశాడు. అయితే సూర్య పాత్ర సినిమాకే హైలైట్ అని చెప్ప‌వ‌చ్చు.

ఇవీ చదవండి: అభిమాని చేసిన ఆ పనికి హృతిక్​ రోషన్​ ఫుల్​ సీరియస్!

'సీతా నీ కన్నీరు కనిపిస్తోంది.. పిలుపు వినిపిస్తోంది'.. సీతారామంపై మనసు పారేసుకుంటున్న నెటిజన్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.