ETV Bharat / entertainment

మహేశ్‌-రాజమౌళి సినిమా షూటింగ్​పై విజయేంద్రప్రసాద్‌ క్లారిటీ - vijayendra prasad commebts

సూపర్​స్టార్​ మహేశ్‌బాబుతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించనున్న సినిమాపై క్లారిటీ ఇచ్చారు రచయిత విజయేంద్రప్రసాద్‌ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది సినిమా మొదలవుతుందని తెలిపారు.

Mahesh-Rajamouli
మహేశ్‌-రాజమౌళి
author img

By

Published : May 10, 2022, 3:15 PM IST

Updated : May 10, 2022, 11:00 PM IST

మహేశ్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కిన 'సర్కారువారి పాట' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్‌ నుంచి త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందే చిత్ర షూటింగ్‌లో మహేశ్‌బాబు పాల్గొంటారని ఇటీవల తెలిపారు. ఈ క్రమంలో అగ్ర దర్శకుడు రాజమౌళితో సినిమా ఎప్పుడు మొదలవుతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దీనికి ప్రముఖ సినీ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ సమాధానం ఇచ్చారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో మహేశ్‌-రాజమౌళి సినిమా మొదలవుతుందని తెలిపారు. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు.

'ప్రస్తుతం కథను సిద్ధం చేస్తున్నాం. స్క్రిప్ట్‌ ఇంకా పూర్తి కాలేదు. అడవి నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ ఏడాది మహేశ్‌బాబు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేస్తున్న మూవీతో బిజీగా ఉంటారు. అందుకే రాజమౌళితో సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో మొదలవుతుంది' అని విజయేంద్ర ప్రసాద్‌ అన్నారు. దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కేఎల్‌నారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇటీవల దీనిపై మహేశ్‌బాబు మాట్లాడుతూ.. రాజమౌళితో కలిసి పనిచేయటానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని అన్నారు. కచ్చితంగా అద్భుతమైన ప్రాజెక్టు అంటూ వివరించారు. ఇండియానా జోన్స్‌ మూవీస్‌లా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు.

ఇదీ చదవండి: 41 ఏళ్ల వయసులో హీరోయిన్ ప్రెగ్నెంట్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్!

Last Updated : May 10, 2022, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.