ETV Bharat / entertainment

ఆ సూపర్​హిట్​ ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తానంటున్న రౌడీ హీరో - విజయ్​ దేవరకొండ లైగర్​

విక్రమ్ సినిమా దర్శకుడు లోకేష్ క‌న‌క‌రాజ్‌తో సినిమా చేయాలనుందని అన్నారు రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. చెన్నైలో జ‌రిగిన లైగ‌ర్ ప్రమోషన్​ ఈవెంట్‌లో లోకేష్ క‌న‌క‌రాజ్‌పై విజ‌య్ ప్ర‌శంస‌లు కురిపించారు.

vijay devarakonda vikram kanagarajvijay devarakonda vikram kanagaraj

author img

By

Published : Aug 14, 2022, 11:39 AM IST

Vijay Devarakonda Lokesh Kangaraj: ఖైదీ, విక్ర‌మ్ సినిమాల‌తో డైరెక్టర్​గా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకున్నారు లోకేష్ క‌న‌క‌రాజ్‌. రెగ్యుల‌ర్ ఫార్మెట్స్‌కు భిన్నంగా త‌న సినిమాల్లో హీరోల‌ను వినూత్న రీతిలో చూపిస్తూ విజ‌యాల్ని అందుకుంటున్నారు. క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'విక్ర‌మ్' సినిమా అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించి సూపర్​హిట్​ చిత్రాల్లో ఒక‌టిగా నిలిచింది. విక్ర‌మ్ స‌క్సెస్ త‌ర్వాత లోకేష్ క‌న‌క‌రాజ్‌తో సినిమాలు చేసేందుకు పలువురు టాలీవుడ్‌, కోలీవుడ్ హీరోలు ఆస‌క్తి చూపుతున్నారు.

తాజాగా ఈ లిస్ట్‌లోకి విజ‌య్ దేవ‌ర‌కొండ చేరిపోయారు. విజ‌య్ హీరోగా న‌టించిన 'లైగ‌ర్' సినిమా ఆగ‌స్టు 25న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్ర‌మోష‌న్స్ కోసం దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో చిత్రబృందం ప‌ర్య‌టిస్తోంది. శ‌నివారం చెన్నైలో జరిగిన 'లైగర్​' సినిమా ఈవెంట్​లో.. లోకేష్ క‌న‌క‌రాజ్ సినిమాల‌కు తాను వీరాభిమాన‌ని విజ‌య్ దేవరకొండ తెలిపారు. ఆయన సినిమాటిక్ యూనివ‌ర్స్​లో ఏదో ఒక రోజు తాను కూడా భాగం అవుతాన‌నే న‌మ్మ‌క‌ముంద‌ని అన్నారు. భవిష్యత్తులో ఆయన నుంచి పిలుపు వస్తుందని అనుకుంటున్నట్లు తెలిపారు. లోకేష్ క‌న‌క‌రాజ్​తో పాటు తమిళంలో పా రంజిత్‌, వెట్రిమార‌న్ సినిమాలంటే ఇష్టమని చెప్పారు.

ఇవీ చదవండి: ఉత్తమ నటుడిగా​ ఆస్కార్ రేసులో తారక్​

కోట్లలో పెట్టుబడులు పెడుతూ స్టార్టప్​ల బాటలో సినీ తారలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.