ETV Bharat / entertainment

'లైగర్' క్రేజ్.. విడుదలకు ముందే రూ.200 కోట్ల బిజినెస్? - లైగర్ ప్రీ బిజినెస్

LIGER movie business: విజయ్ దేవర కొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్​లో వస్తున్న చిత్రం లైగర్.. ప్రీ బిజినెస్​లో దూసుకెళ్తోంది. సుమారు రూ.200 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

liger movie pre release business
liger movie pre release business
author img

By

Published : May 3, 2022, 5:06 PM IST

LIGER movie business: విజ‌య్ దేవ‌ర‌కొండ‌ తొలి పాన్ ఇండియా చిత్రం 'లైగ‌ర్'. పూరీ తెరకెక్కించిన ఈ చిత్రంపై మంచి క్రేజ్ ఏర్పడింది. బాక్సింగ్ నేపథ్యంలో చిత్రం తెరకెక్కడం, మాజీ ప్రో బాక్సర్ మైక్ టైసన్ సినిమాలో కీలక పాత్ర చేయడం వల్ల.. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు లైగర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్​ను నిరూపిస్తూ.. లైగర్ భారీగా ప్రీ బిజినెస్ చేస్తోంది. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్ భారీ స్థాయికి అమ్ముడయ్యాయి! సుమారు రూ.200 కోట్ల బిజినెస్ జరిగిందని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

LIGER pre biz: సినిమా సంగీత హక్కులను సోనీ సంస్థ రూ.14 కోట్లకు కొనుగోలు చేసిందట. ఓటీటీ రైట్స్​ను డిస్నీ ప్లస్ హాట్​స్టార్ రూ.65 కోట్లకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. శాటిలైట్ హక్కులను స్టార్ మా మంచి రేటుకు కొనేసిందట. థియేట్రికల్ రైట్స్ సైతం భారీ రేటుకే అమ్ముడయ్యాయని సమాచారం చక్కర్లు కొడుతోంది. ఏపీ, నైజాంలో కలిపి ఈ సినిమా రూ.75 కోట్లకు అమ్ముడైందని ఇండస్ట్రీ వర్కాలు కోడై కూస్తున్నాయి. హిందీ వెర్షన్ రూ.25 కోట్లకు విక్రయించారట. కర్ణాటక రూ.7 కోట్లు, తమిళనాడు-కేరళ రూ.8కోట్లు, ఓవర్సీస్​ రైట్స్ రూ.10 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. మొత్తంగా థియేట్రికల్ బిజినెస్ రూ.120 కోట్లకు పైగా జరిగిందట. విజయ్ దేవరకొండతో పాటు, పూరీ జగన్నాథ్​కు ఇదే తమ కెరీర్ బెస్ట్ బిజినెస్ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఇదీ చదవండి:

అయ్యో పాపం.. కీర్తి సురేశ్ కాస్ట్యూమ్స్ అన్నీ ఎత్తుకెళ్లారట!

విజయ్ దేవరకొండతో రష్మిక పెళ్లి.. నిజమెంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.