Vijay Devarakonda Marriage : ది విజయ్ దేవరకొండ తన పెళ్లిపై మరోసారి కామెంట్స్ చేశారు. తనకు కాబోయే భార్య ఎలా ఉండాలి? ఏం చేయాలి లాంటి విషయాల్ని చెప్పుకొచ్చారు. విజయ్-సమంత కలిసి నటించిన 'ఖుషి' సెప్టెంబరు 1న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్.. తన పెళ్లి గురించి హింట్ ఇచ్చారు.
Vijay Devarakonda Marriage news : 'పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?' అని అడగగా.. చేసుకోవాలనిపించినప్పుడు చేసుకుంటాను. ఎవరో ఒత్తిడి పెడుతున్నారని నిర్ణయం తీసుకోను. ఒకవేళ అన్నీ కుదిరితే మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్‌గా పెళ్లి చేసుకుంటాను. అందుకే చేసుకునే సమయంలో ఎవరికీ చెప్పను.
'మీ జీవిత భాగస్వామి ఎలా ఉండాలనుకుంటున్నారు?' అని అడగగా.. తన ఇష్టాయిష్టాలను మెచ్చే అమ్మాయి.. తన జీవితంలోకి రావాలని అన్నారు విజయ్. "ఇంటిలిజెంట్ అయి ఉండాలి. నేను ఇష్టపడే వాటిని తనూ ఇష్టపడాలి. చిన్న చిన్న విషయాలు.. తనే నాకు గుర్తుచేసేలా ఉండాలి. ఎందుకంటే తినడం దగ్గర నుంచి సెలవ వరకు చాలా విషయాలను నేను మర్చిపోతుంటాను. కానీ నన్ను చేసుకోబోయే అమ్మాయి మాత్రం.. అవన్నీ గుర్తు చేసేలా ఉండాలి" అని విజయ్ పేర్కొన్నారు.
ఇంకా పలు విషయాల గురించి కూడా మాట్లాడారు. 'మీ డ్రీమ్ రోల్?' గురించి ప్రశ్నించగా.. 'డ్రీమ్ రోల్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. మనసుకు నచ్చిన పాత్రలు పోషిస్తుంటాను. ఇక నా ఇన్స్పిరేషన్కు ఫలానా వ్యక్తి అంటూ ఎవరూ లేరు. నేనెప్పుడూ గౌరవం, డబ్బు కావాలని కోరుకుంటాను. ఇవే నాకు స్ఫూర్తిగా నిలుస్తుంటాయి." అని అన్నారు.
Vijay Devarakonda Kushi Movie Release Date : విజయ్-సమంత కలిసి నటించిన 'ఖుషి' సినిమాను మైత్రీ మువీ మేకర్స్ నిర్మించింది. సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. మజిలీ, నిన్ను కోరి ఫేమ్ దర్శకుడు శివ నిర్వాణ.. ఈ చిత్రాన్ని లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Kushi Bookings: ఇక 'ఖుషి' వంతు.. బుకింగ్స్ షురూ.. సెప్టెంబర్ బాక్సాఫీస్‌కు సవాల్!