ETV Bharat / entertainment

ఉత్కంఠ రేపుతున్న హత్య ట్రైలర్, రంగ రంగ వైభవంగా రిలీజ్​ డేట్​ ఫిక్స్ - శాసనసభ సినిమా

సినీ అప్డేట్లు వచ్చేశాయి. తమిళ నటుడు విజయ్ ఆంటోని హీరోగా నటించిన హత్య ట్రైలర్ విడుదలైంది. మరోవైపు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కిన రంగ రంగ వైభవంగా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

vijay antony hatya trailer
విజయ్ ఆంటోని
author img

By

Published : Aug 16, 2022, 5:20 AM IST

Vijay Antony Hatya Trailer: తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్‌ ఆంటోని. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతూ ఉంటుంది. తాజాగా బాలాజీ కె.కుమార్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని నటించిన తమిళ చిత్రం 'కోలాయ్‌'. తెలుగులో 'హత్య' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. లైలా అనే ఇండియన్‌ సెలబ్రిటీ మోడల్‌ హత్యకు గురవుతుంది. ఆ హత్య కేసును విజయ్‌ ఆంటోని, అతని బృందం ఎలా ఛేదించింది?వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే అంశాల చుట్టూ ఉత్కంఠగా కథను అల్లుకున్నాడు దర్శకుడు బాలాజీ. మరి ఇంతకీ ఆ హత్య చేసింది ఎవరు? చూసింది ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Ranga Ranga Vaibhavanga Release Date fix: వైష్ణవ్ తేజ్ హీరోగా 'రంగ రంగ వైభవంగా' సినిమా రూపొందింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి గిరీశాయ దర్శకత్వం వహించారు. కేతిక శర్మ హీరోయిన్​గా నటించిన ఈ సినిమాను సెప్టెంబర్ 2వ తేదీని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సోమవారం వెల్లడించింది.

'అహం' అనే ఓ కొత్త పాయింట్​ను టచ్ చేస్తూ సినిమాలోని లవ్ స్టోరీ కొనసాగుతుందని సమాచారం. అయితే ఎవరి అహంభావం చుట్టూ ఈ కథ తిరుగుతుంది? దాని పరిణామాలు ఎలా ఉంటాయి? అనేది సస్పెన్స్. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు బాణీలు సమకూర్చారు. హీరో పవన్ కల్యాణ్​ పుట్టినరోజున ఈ సినిమా రిలీజ్ అవుతుండడం వల్ల మెగా ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

sasana sabha movie: వైవిధ్యమైన పాత్రలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరించే అతికొద్ది మంది నటుల్లో డా. రాజేంద్ర ప్రసాద్ ఒకరు. ఆయన తాజాగా నటించిన చిత్రం 'శాసన సభ'. ఇందులో ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్‌ జంటగా నటించగా.. సోనియా అగర్వాల్‌, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. వేణు మడికంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలైన తులసీ రామ్‌ సాప్పని, షణ్ముగం సాప్పని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శాసన సభ చిత్ర యూనిట్ తాజాగా ఆసక్తికర అప్డేట్​ను ఇచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్​లుక్‌ పోస్టర్‌ను సోమవారం విడుదల చేసింది.

ఇవీ చదవండి: ఆ చిత్రంతోనే తాను నటుడిగా మారానంటున్న బ్రహ్మాజీ

బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్న బాలీవుడ్​ మూవీలు, కారణం అదేనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.