ETV Bharat / entertainment

'మేడమ్​ జీ.. ఎంతో ఆనందం!'.. ద్రౌపదీ ముర్మును కలిసిన సమంత, వరుణ్​

సెర్బియాలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును స్టార్​ హీరోయిన్​ సమంత, హీరో వరుణ్​ ధావన్​.. మర్యాదపూర్వకంగా కలిశారు. అందుకు సంబంధించిన ఫొటోను వారు ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేశారు.

varun-dhawan-samantha-ruth-prabhu-meet-president-murmu-in-serbia2

author img

By

Published : Jun 8, 2023, 8:17 PM IST

Updated : Jun 8, 2023, 9:42 PM IST

భారత రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ద్రౌపదీ ముర్ము.. సెర్బియాకు వెళ్లారు. ఈ సందర్భంగా ముర్మును టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సమంతతోపాటు బాలీవుడ్​ కథానాయకుడు వరుణ్​ ధావన్​ కలిశారు. వీరితో పాటు 'సిటాడల్' వెబ్​సిరీస్​ దర్శకులు రాజ్, డీకే కూడా ఉన్నారు. ముర్ముతో కాసేపు వీరంతా ముచ్చటించారు. ఈ మర్యాదపూర్వక భేటీకు సంబంధించిన ఫొటోలను వరుణ్​ ధావన్.. ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేశారు.

"సిటాడెల్ టీమ్​కు​.. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసే అదృష్టం దక్కింది. ఇది మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. మిమ్మల్ని (ద్రౌపదీ ముర్ము) కలవడం ఎంతో అమ్మా" అంటూ వరుణ్​ ధావన్​ రాసుకొచ్చారు. అయితే వరుణ్​ పోస్ట్​ను సమంత ఇన్​స్టాలో రీషేర్​ చేసింది. "మేడమ్ ప్రెసిడెంట్" అంటూ రాసుకొచ్చింది. అయితే ఆ ఫొటోల్లో సమంత క్యూట్ హెయిర్ స్టైల్​తో కళ్లజోడు పెట్టుకుని కొత్తగా కనిపిస్తోంది.

varun-dhawan-samantha-ruth-prabhu-meet-president-murmu-in-serbia2
సమంత ఇన్​స్టా స్టోరీ

అయితే సురినాంలో మూడు రోజుల పర్యటన అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం సెర్బియా చేరుకున్నారు. బెల్​గ్రేడ్​లోని నికోలా టెస్లా విమానాశ్రయంలో ద్రౌపదీ ముర్మును సెర్బియా అధ్యక్షుడు అలెక్సాండర్‌ వూచిచ్‌ స్వాగతం పలికారు. ఆ తర్వాత విమానాశ్రయం నుంచి బెల్​గ్రేడ్​లోని గాంధీజీవా వీధికి వెళ్లిన ముర్ము.. అక్కడ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించారు.

భారత దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ దశాబ్ది చివరకు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా మౌలిక సదుపాయాలు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయని, 2047కు అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చోటు దక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలీనోద్యమ కాలం నుంచి సెర్బియా, భారత్‌ల మధ్య సత్సంబంధాలు వేళ్లూనుకున్నాయని తెలిపారు. పలు క్రీడల్లో భారతీయ ఆటగాళ్ల నైపుణ్యాలను పెంచేలా సెర్బియా కోచ్‌లు శిక్షణ ఇస్తున్నారని గుర్తు చేశారు. సురినాంలో మూడు రోజుల పర్యటన అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం సెర్బియా చేరుకున్నారు.

టాలీవుడ్​ స్టార్ హీరోయిన్ సమంత.. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత నటిస్తున్న మరో వెబ్ సిరీస్ 'సిటాడెల్'. ఇంగ్లీష్​లో స్టార్​ హీరోయిన్​ ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్​కు ఇది ప్రీక్వెల్​గా తెరకెక్కుతోంది. ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ అండ్ డీకే ఈ యాక్షన్ వెబ్ సిరీస్​ను తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్​లో సమంత వరుణ్ ధావన్​తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. వీళ్లిద్దరూ ప్రియాంక చోప్రా తల్లిందండ్రులుగా నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సిటాడెల్ షూటింగ్ సెర్బియాలో జరుగుతోంది. దీనితో సిటాడెల్ టీమ్​కు అక్కడ ద్రౌపదీ ముర్మును కలసి అవకాశం లభించింది.

Last Updated : Jun 8, 2023, 9:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.